/rtv/media/media_files/wOa00MkfIJEYPB2yF4Zr.jpg)
Warangal Congress leaders
Warangal Congress leaders : వరంగల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విబేధాలన్నీ సమసిపోయాయని క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లురవి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసి పనిచేస్తారని స్పష్టం చేశారు. అంతకు ముందు హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళి గాంధీ భవన్‌కు వచ్చారు.
అనంతరం కొండా మురళి పీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఇప్పటికే ఒకసారి ఆయన హాజరై వివరణ ఇచ్చారు. ఇటీవల ఓ కార్యక్రమంలో వరంగల్‌లోని నేతలను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను గతంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. గాంధీ భవన్‌కు పిలిచి వివరణ కోరింది. అప్పుడు ఆయన వివరణ ఇచ్చారు. అయితే లిఖిత పూర్వక వివరణ కోసం మళ్లీ షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. ఈక్రమంలో ఆయన కమిటీ ముందు ఆదివారం మరోసారి హాజరయ్యారు.
కాగా కొండా మురళి గాంధీభవన్ కు వచ్చిన సమయంలో అక్కడ కొంత సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొంతమంది మీడియా ప్రతినిధులు మురళిని చుట్టు ముట్టగా ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్రమశిక్షణా కమిటీ కంటే ముందే నేనే వచ్చాను.. గాంధీ భవన్కు రావొద్దా ఏంటి అని కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, వరంగల్ జిల్లాలో కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కొండా మురళి కూడా క్రమశిక్షణ సంఘం ముందు హాజరై ఇప్పటికే తన వాదనను వినిపించారు. తాజాగా మురళి మరోసారి క్రమశిక్షణ సంఘం ముందు ఆదివారం హాజరయ్యారు. ఈ సమావేశంలో మురళిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ, వరంగల్ జిల్లా నేతల మధ్య విబేధాలు సమసిపోయాయని మల్లు అనడం గమనార్హం.
ఈ సందర్భంగా కొండా మురళి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీనే తమ రక్తంలో ఉందన్నారు. పార్టీ ఏ ఆదేశమిచ్చినా తప్పక పాటిస్తామని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. క్రమశిక్షణ కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు కొండా మురళి వివరించారు. తన సమాధానంతో కమిట సంతృప్తి చెందిందని చెప్పుకున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మా దృష్టికి రాలేదు: మల్లు రవి
క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన క్రమశిక్షణ కమిటీ సమావేశంలో వరంగల్ నేతల మధ్య విభేదాలు, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంశంపై చర్చించామన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదన్నారు. కొండా మురళి లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యేలు కూడా లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారని వివరించారు.
ఇది కూడా చూడండి: IAF: ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలు కూల్చేశాం.. IAF చీఫ్ సంచలన వ్యాఖ్యలు