Insurance: అప్పులు చెల్లించలేక అన్న పేరిట రూ.కోట్ల ఇన్సూరెన్స్‌.. ఆపై టిప్పర్‌తో తొక్కించి...

అప్పుల పాలైన ఓ తమ్ముడు వాటిని చెల్లించలేక మానసికంగా సరిగా లేని అన్న ప్రాణాల్నే పణంగా పెట్టాడో ప్రభుద్దుడు. ఇందుకోసం అన్నపేరిట రూ.4.14కోట్లకు బీమా పాలసీలు చేయించి మరీ హత్య చేశాడు. ఈ దారుణం కరీంనగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

New Update
FotoJet - 2025-12-03T130749.735

Brother kills brother for insurance money

"ధనం మూలం ఇదం జగత్' అన్నారు పెద్దలు. అంటే డబ్బుతో ఈ ప్రపంచం నడుస్తోంది అని అర్థం. అప్పుల పాలైన ఓ తమ్ముడు వాటిని చెల్లించలేక మానసికంగా సరిగా లేని అన్న ప్రాణాల్నే పణంగా పెట్టాడో ప్రభుద్దుడు. ఇందుకోసం అన్నపేరిట రూ.4.14కోట్లకు బీమా పాలసీలు చేయించి మరీ హత్య చేశాడు. ఈ దారుణం కరీంనగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి నరేశ్‌ మూడేళ్ల క్రితం రెండు టిప్పర్‌లు కొన్నాడు. వాటిని అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో అప్పుల పాలయ్యాడు. నెలనెలా దానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. దానికోసం అయిన వారందరి దగ్గర అప్పులు చేశాడు. మరోవైపు షేర్‌ మార్కెట్లోనూ పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. ఇలా మొత్తం మీద రూ.1.50 కోట్ల వరకు అప్పులయ్యాయి. అప్పుల బాధలు అధికమవడంతో.. ఏం చేయాలో తెలియక తనతోపాటు ఇంట్లోనే ఉంటున్న అవివాహితుడైన అన్న మామిడి వెంకటేశ్‌(37)ను చంపాలని కుట్ర పన్నాడు. మానసిక వికలాంగుడైన అన్నను ప్రణాళిక ప్రకారం హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ అది విఫలమై పోలీసులకు చిక్కాడు.

Also Read :  పంచాయతీ ఎన్నికలకు పైసల్లేవ్.. షాకింగ్ నిజాలు!

రూ.4.14కోట్లకు బీమా పాలసీలు చేసి..

అయితే అన్నను చంపేందుకు ప్లాన్‌(murder) చేసిన నరేష్‌  మానసికంగా సరిగాలేని అన్న ప్రాణాల్ని పణంగా పెట్టాడు. ఇందుకోసం రెండు నెలల కిందటి నుంచి అన్న వెంకటేశ్‌ పేరు మీద నాలుగు ప్రైవేటు బీమా సంస్థలతోపాటు ప్రభుత్వ బీమా సంస్థల నుంచి వేర్వేరుగా రూ.4.14కోట్లకు బీమా పాలసీలు(insurance) చేయించాడు. ఇందుకు సంబంధించిన ప్రీమియాన్ని చెల్లిస్తూ వస్తున్నాడు. అతను మరణిస్తే డబ్బులు వస్తాయని అదను కోసం వేచి చూశాడు. ఈలోపు నరేష్‌ కు అప్పు ఇచ్చిన ముండ్ల రాకేశ్‌ అనే వ్యక్తి తనకు చెల్లించాల్సిన రూ.7లక్షల కోసం ఒత్తిడి పెంచసాగాడు. దీంతో తన అన్నని ప్రణాళిక ప్రకారం చంపుతున్నానని సహకరిస్తే తనకు ఇవ్వాల్సిన రూ.7లక్షలకు అదనంగా రూ.13లక్షలు కలిపి ఇస్తానని రాకేశ్‌ను ఒప్పందం చేసుకున్నాడు. అన్న వెంకటేశ్‌ పేరిట కోట్లాది రూపాయల బీమా సొమ్మువస్తుందని, ఆ డబ్బు ఇస్తానని చెప్పి.. ఇందుకోసం రోడ్డు ప్రమాదంలో అన్నను చంపుదామని నిర్ణయం తీసుకున్నాడు.ఈ క్రమంలోనే టిప్పర్‌ డ్రైవర్‌ ప్రదీప్‌ను కూడా ఒప్పించారు. ఒప్పంద సమయంలోనే వీరు ముగ్గురు ఒకవేళ విషయం బయటకు వస్తే ముగ్గురం ఆ శిక్షను భరించాలని వీడియో రికార్డు చేసుకున్నారు.

ప్రణాళికలో భాగంగా గత నెల 29న రాత్రి 11 గంటలకు  గ్రామశివారులోని పెట్రోల్‌ బంక్‌ దగ్గర రహదారిపై టిప్పర్‌(tipper-lorry) ఆగిపోయిందని డ్రైవర్‌ ప్రదీప్‌ ఫోన్‌ చేసి నరేశ్‌కు చెప్పాడు. ఈ క్రమంలోనే తన అల్లుడు సాయి బైక్‌పై అన్న వెంకటేశ్‌ను టిప్పర్‌ వద్దకు పంపించాడు. వెనుకాలే నరేశ్‌ కూడా వెళ్లాడు. టిప్పర్‌ చక్రం కింద జాకీ పెట్టాలని.. వెంకటేశ్‌ని కింద పడుకోబెట్టి నరేశ్‌ టిప్పర్‌ను నడుపుతూ ముందుకు కదిలించాడు. దీంతో వెంకటేశ్‌ టైర్లకిందపడి అక్కడిక్కడే చనిపోయాడు. డ్రైవర్‌పైన కేసును నెట్టాలని అతన్ని పారిపోమ్మన్నాడు. దీంతో అతను పారిపోయాడు. ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదమని.. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లనేనని పోలీసుల్ని నమ్మించాడు. 

అయితే బీమా డబ్బుల విషయంలో ఆ  సంస్థకు సంబంధించిన ప్రతినిధులకు నరేశ్‌ చెప్పే విధానంపై అనుమానం వచ్చిన వారు పోలీసుల్ని ఆశ్రయించారు..దీంతో  పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో అసలు నిగ్గు తేలింది. దీంతోపాటు నరేశ్‌ అల్లుడైన సాయి కూడా ప్రమాద సమయంలో టిప్పర్‌ను నడిపింది డ్రైవర్‌ కాదని నరేశ్‌ అని చెప్పడంతో కుటుంబీలకు అనుమానం వచ్చింది.  బీమా సొమ్ము కోసమే చంపానని పోలీసుల విచారణలో నరేశ్‌ అంగీకరించినట్టు సీపీ తెలిపారు. ఈ మేరకు నరేశ్‌తోపాటు రాకేశ్, డ్రైవర్‌ ప్రదీప్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read :  ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Advertisment
తాజా కథనాలు