Pamela Satpathy: పాపకు జోలపాడిన కలెక్టర్...పాట వింటూ ఆ చిన్నారి ఏం చేసిందంటే...
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి జోలపాట పాడి అందరి మనసులు గెలుచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ చిన్నారి పాపకు పమేలా సత్పతి జోల పాట పాడింది. ఆమె పాటకు చిన్నారి కూడా శ్రద్ధగా వింటూ కలెక్టర్ ఒడిలో ఒదిగిపోయింది.