/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
accident
Road Accident In Khammam District
ఖమ్మం జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం కిష్టారంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది(Car Accident). ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం జిల్లా కిష్టారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్పాట్‌లోనే ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గ్రామం నుంచి.. గృహప్రవేశానికి సత్తుపల్లి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు భద్రాద్రి జిల్లా చండ్రుగొండ వాసులుగా గుర్తించారు. మృతి చెందిన వారిలో సిద్దేశీ జాయ్(18), మర్సకట్ల శశి (12), సాధిక్ ఉన్నారు.
Also Read : iBomma రవికి పోలీసు ఉద్యోగం?
Also Read : తిరుపతిలో మృతదేహాలు కలకలం...!
Follow Us