షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. రూ.5లక్షల వరకు ప్రమాద బీమా
షిర్డీ వెళ్లే భక్తులకు సాయిబాబా సంస్థాన్ గుడ్ న్యూస్ తెలిపింది. భక్తులకు రూ.5 లక్షల ప్రమాద బీమాను అందించనున్నట్లు వెల్లడించింది. సాయిబాబా దర్శనం, భక్త నివాస్, అభిషేకానికి అధికారిక వెబ్సైట్లలో బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.