TG Local Elections: పంచాయతీ ఎన్నికలకు పైసల్లేవ్.. షాకింగ్ నిజాలు!

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఎన్నికల ఖర్చుకోసం ప్రభుత్వం ఇంతవరకు నిధులు కేటాయించకపోవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.పైసా ఇవ్వకుండా ఎన్నికలు ఎలా నిర్వహించడమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

New Update
tg

Grama Panchayathi Elections

Grama Panchayathi Elections : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఎన్నికల ఖర్చుకోసం ప్రభుత్వం ఇంతవరకు నిధులు కేటాయించకపోవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.పైసా ఇవ్వకుండా ఎన్నికలు ఎలా నిర్వహించడమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరపడడంతో  నిధులు కొరతతో ఏం చేయాలో తెలియక అధికారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. పాలనాపరమైన ఖర్చులకు కూడా నిధులు లేక ఎంపీడీవోలు చేతులు ఎత్తేస్తున్నారు.

Also Read :  iBomma రవికి  పోలీసు ఉద్యోగం?

 ప్రభుత్వం నుంచి తమకు చిల్లిగవ్వ రాలేదని, కలెక్టర్లు కూడా తమకు ఎలాంటి నిధులు కేటాయించలేదని ఎంపీడీవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం నుంచి ఒక్కో మండలానికి కనీసం రూ.7 లక్షల వరకు విడుదలయ్యేవని. కానీ, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పైసా కూడా విడుదల చేయకపోవడంతో అడ్మినిస్ట్రేషన్‌ ఖర్చులు (నిర్వహణ వ్యయం) ఎలా చెల్లించాలన్నది అధికారులకు ప్రశ్నార్థకంగా మారింది. తొలి విడతలో ఎన్నికలు జరిగే 3,242 సర్పంచ్‌ స్థానాలకు, 37,440 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. రెండో విడత నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. కానీ, ఈ ఎన్నికల నిర్వహణ, జీరాక్సులు, భోజనాలకు కూడ డబ్బులు లేక అధికారులు అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు వాపోతున్నారు.

Also Read: Russia-Ukraine: ముందుకు సాగని చర్చలు..శాంతి ప్రణాళికకు అంగీకరించని రష్యా

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గతంలో ప్రభుత్వం రూ.315 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.150 కోట్లు ఎంపీటీసీ (మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం) ఎన్నికలకు, రూ.175 కోట్లు గ్రామ పంచాయతీ (జీపీ) ఎన్నికలకు కేటాయించింది. ఆ నిధులన్నీ అప్పటి ఎన్నికలకే ఖర్చయిపోయాయని ఎంపీడీవోలు చెబుతున్నారు. నిధుల కోసం ఎస్‌ఈసీ అధికారులను అడుగగా.. నిర్వహణ ఖర్చులను పంచాయతీరాజ్‌శాఖ చూసుకుంటుందని, తమకు సంబంధం లేదని చేతులెత్తేశారని చెబుతున్నారు. పంచాయతీ అధికారులను అడిగితే.. 2023లో ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం నిధులు ఇచ్చిందని, అప్పట్లో పోలింగ్‌కు   రూ.10-12 వేలు ఖర్చు అవుతుందని ప్రతిపాదించామని తెలిపారు.

Also Read :  దక్షిణ సూడాన్‌లో విమానం హైజాక్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

కానీ, ఇప్పుడు రూ.20 వేల వరకు ఖర్చు అవుతుందని, ఆ మేరకు మళ్లీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని అధికారులు చెప్పారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం జిల్లా పంచాయతీ అధికారుల నుంచి ఎంపీడీవోలకు చిల్లిగవ్వ కూడా రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వేలాది మంది ఉద్యోగులు, అధికారులకు భోజన బిల్లులు, ఇతర అలవెన్సులు చెల్లించేందుకు నిధులు లేకపోవడంతో ఆ భారాన్ని ఎవరు మోస్తారనే విషయంలో ఆందోళన నెలకొంది.  ఈ అత్యవసర ఖర్చుల కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.

Also Read :  iBomma రవికి  పోలీసు ఉద్యోగం?

Also Read :  తిరుపతిలో మృతదేహాలు కలకలం...!

Advertisment
తాజా కథనాలు