Crime News : వీడు కోచ్‌ కాదు...కామాంధుడు..వాలీబాల్ కోచ్ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్య

ప్రేమ పేరుతో కోచ్‌ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ప్రేమపేరుతో విద్యార్థినీని వేధించడంతో తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

New Update
Volleyball coach harasses student, leads to suicide

Volleyball coach harasses student, leads to suicide

Crime News :  ప్రేమ పేరుతో కోచ్‌ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రఘు బాబు తెలిపిన వివరాల ప్రకారం..  ప్రమోద్‌కుమార్‌ రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి ఆయన లాలాపేటలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసముంటున్నారు. అయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.పెద్ద కుమార్తె మౌలిక (19) ) అలియాస్‌ వెన్నెల తార్నాకలోని రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

Also Read :  మోహన్‌బాబుకు బిగ్‌ షాక్‌... విశ్వవిద్యాలయానికి భారీ జరిమానా

తార్నాక సమీపంలోని మాణికేశ్వర్‌ నగర్‌కు చెందిన అంబాజీ అనే యువకుడు కొన్ని నెలల క్రితం రైల్వే డిగ్రీ కాలేజీలో వాలీబాల్‌ కోచ్‌గా జాయిన్‌ అయ్యాడు. కొద్ది రోజులుగా అతను మౌలికను ప్రేమ పేరుతో వేధించడం మొదలు పెట్టాడు. మౌలికను  ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పోలీసులు, స్నేహితులు తెలిపారు. యువతి తీవ్ర మనస్తాపంతో బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇది కూడా చదవండి:దీపావళికి ఫిట్‌గా కనిపించాలంటే... తక్కువ రోజుల్లో 2-4 కేజీల బరువుని ఇలా తగ్గించుకోండి!!

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అంబాజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతురాలి సెల్‌ఫోన్‌లో డేటా పూర్తిగా డిలీట్‌ చేసి ఉందని, డేటాను రిట్రీవ్‌ చేస్తున్నట్లు  పోలీసులు చెప్పారు. వేధింపులకు పాల్పడిన అంబాజీ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Also Read: హైకోర్టు స్టే.. ఎన్నికలకు రేవంత్ సర్కార్ ముందు 3 ఆప్షన్లు

Advertisment
తాజా కథనాలు