Telangana: తెలంగాణ లో భిన్న వాతావరణం.. ఆ జిల్లాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎండలు.. !

తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

New Update
ap rains

ap rains

తెలంగాణలో విభిన్న వాతావరణం పరిస్థితులు కనపడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మాడు పగిలే ఎండలు కొడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు.. తూర్పు రాజస్థాన్ నుండి మన్నార్ గల్ఫ్ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో పాటు, తూర్పు మధ్యప్రదేశ్ వద్ద కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read:  Time Most Influential Persons: టైమ్స్ ప్రభావశీలుర జాబితాలో ట్రంప్,యూనస్‌...భారతీయులకు దక్కని ప్లేస్‌!

Telangana Weather Forecast

ఈ రోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా గురువారం  ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,  నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రోజు గరిష్టంగా మెదక్‌లో 41.9 డిగ్రీలు, కనిష్టంగా భద్రాచలంలో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

Also Read: Telangana: మందుబాబులకు షాకింగ్​ న్యూస్​​.. పెరగనున్న ధరలు.. ఎంతంటే!?

ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ, మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. బుధవారం (ఏప్రిల్ 16న) నిజామాబాద్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత మెదక్‌లో 41.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 41.6 డిగ్రీలు, రామగుండంలో 39.2 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 38.9 డిగ్రీలు, ఖమ్మంలో 38.6 డిగ్రీలు, భద్రాచలంలో 38 డిగ్రీలు, నల్లగొండలో 37.5 డిగ్రీలు, హైదరాబాద్‌లో 37.4 డిగ్రీలు, హనుమకొండలో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అత్యధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా వాతావరణ శాఖ గురువారం  మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, కొమరం భీమ్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 8 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాగల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

Also Read: Jammu Kashmir-Supreme Court: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Also Read: Google: 247 మిలియన్ల ప్రకటనలపై గూగుల్ ఉక్కుపాదం!

telangana | weather | TG weather1 | TG Weather Updates | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | rains | summer

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు