/rtv/media/media_files/2025/02/16/6uvteTUuHgGFZjBeBLT8.jpg)
musk trump Photograph: (trump)
ప్రపంచమంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్ జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.
Time Most Influential Persons List
2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన విడుదల చేసింది.ఇందులో అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, నోబెల్ బహుమతి గ్రహీత..బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్,అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్,టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ వంటి వారికి చోటు దక్కింది.
జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్,పాపులర్ సింగర్ ఈద్ షరీన్,ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్ ల పేర్లు కూడా ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..భారత్ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో..షారూఖ్ కాన్ ,అలియాభట్, సాక్షి మాలిక్ పేర్లు ఈ జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ మధ్య కాలంలో ఇలా భారతీయుల పేర్లు లేకుండా ఉండడం ఇదే తొలిసారి.అయితే భారతీయులెవరికీ చోటు దక్కకపోయినప్పటికీ భారత సంతతికి చెందినవర్టెక్స్ ఫార్మాసూటికల్స్ సీఈవో రేష్మా కేవల్రమణి పేరు ఈ జాబితాలో ఉంది. ఆమె ముంబైలో పుట్టినప్పటికీ 11 సంవత్సరాల వయసులోనే ఆ కుటుంబం అమెరికా వెళ్లిపోయింది.
trump | elan-musk | time | influential actor | list | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | keir-starmer