/rtv/media/media_files/2025/04/16/a2Aysv8LEybke2TC8nZJ.jpg)
Supreme Court
నేషనల్ కాన్ఫరెన్ష్ నేత, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విడాకుల కేసుపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు కోరుతూ జమ్మూ కశ్మీర్ సీఎం అబ్దుల్లా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏప్రిల్ 15న విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఒమర్ దంపతులిద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని సూచించింది.
Also Read: Ap Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..!
తమ మధ్య ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని న్యాయస్థానం చెప్పింది. ‘‘ఈ కేసులో కౌన్సిలింగ్ ప్రక్రియ విఫలమైంది.. దంపతులకు మరో ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నాం... తమ మధ్య విబేధాలకు కారణమైన అంశాలపై శాంతియుతంగా చర్చించుకోవాలి.. ఈ ప్రక్రియ మూడు వారాల్లోగా పూర్తి కావాలి’’ అని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ వివాహ వ్యవస్థ ఒక బంధమే కాదు, బాధ్యత కూడా అని చెప్పుకొచ్చింది.
Also Read: Google: 247 మిలియన్ల ప్రకటనలపై గూగుల్ ఉక్కుపాదం!
Jammu & Kashmir CM Divorce Case
సంసారంలో సమస్యలు వచ్చినప్పుడు చర్చల ద్వారా పరిష్కారం ఉండాలనే అంశానికి ప్రాధాన్యత ఉంది.. వ్యక్తిగత జీవితం కంటే శాంతియుత ముగింపు అవసరం’ అని న్యాయస్థానం తన అభిప్రాయాన్ని తెలియజేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల7కు వాయిదా వేసింది.
ఫరూక్ అబ్దుల్లా తనయుడైన ఒమర్ .. జేడీయూ సీనియర్ నేత రామ్‌నాథ్ ఠాకూర్ కుమార్తె పాయల్‌కు 1994లో వివాహం జరిగింది. వీరికి జమీర్ అబ్దుల్లా, జహీర్ అబ్దుల్లా అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే, దంపతుల మధ్య మనస్ఫర్దలు రావడంతో 2009 నుంచి విడివిడిగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఒమర్ అబ్దుల్లా 2016లో కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ, కోర్టు ఆయన విడాకుల పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 2023లో ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
కానీ, అక్కడా ఒమర్‌కు నిరాశే తప్పలేదు. కింది కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో గతేడాది ఆయన సుప్రీం కోర్టు గడపతొక్కారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ దంపతులకు మరో అవకాశం కల్పించింది. సమస్యను కలిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి సూచనలు చేసింది. కాగా, పదేళ్ల అనంతరం గతేడాది జమ్మూ కశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
Also Read:భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
Also Read: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
telugu-news | jammu-kashmir | latest-telugu-news | Omar Abdullah | latest telugu news updates | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu