Telangana: మందుబాబులకు షాకింగ్​ న్యూస్​​.. పెరగనున్న ధరలు.. ఎంతంటే!?

తెలంగాణలో లిక్కర్‌ ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.బాటిల్ ధర అయిదు రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్‌పైన కనీసం పది శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
liquor

తెలంగాణలో ఇటీవల బీర్‌ ధరలు పెంచినప్పటికీ లిక్కర్‌ ధరలు పెంచలేదు. ఇప్పుడు తాజాగా లిక్కర్‌ ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ మంది తాగే చీప్‌లిక్కర్‌ను ఈ ధరలు పెంపు నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమ్ముడు పోతున్న మద్యం క్వాంటిటి చూసినట్లయితే, బీర్‌ కంటే కొంత తక్కువ విక్రయాలు జరుగుతాయి. 

Also Read: Jammu Kashmir-Supreme Court: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

2023-24లో 3.62 కోట్లు కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరగగా, 2024-25లో రెండు శాతం పెరిగినట్లు సమాచారం. ధరలు పెరుగుదల ఎక్కువ ధరలు కలిగిన లిక్కర్‌ పైనేనని అధికారులు చెబుతున్నారు. అది ఏవిధంగా తీసుకోవాలన్న కోణంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. బాటిల్ ధర అయిదు రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్‌పైన కనీసం పది శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయిదు వందల విలువ చేసే మద్యం బాటిల్‌పై కనీసం రూ.50 పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంఆర్పీ ధరను ఆధారంగా ఈ రేట్లు పెరుగుతాయని అధికార యంత్రాంగం భావిస్తుంది.

Also Read: Ap Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..!

Liquor Prices Hike In Telangana

రెండు, మూడు విధానాల్లో లిక్కర్​ ధరలను పెంచి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఏయే విధానం ద్వారా ఎంత ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుందో కూడా ఆ నివేదికల్లో వెల్లడిస్తారు. అధికారులతో సమీక్షించిన తర్వాత మరింత లోతైన అధ్యయనం చేసి ధరలు పెంపుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.ఏడాదికి తక్కువలో తక్కువ అనుకున్నా రూ. 2000 కోట్లు అదనపు రాబడి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. బీర్ల ధరలను 15 శాతం వరకు పెంచుకునేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ధరల పెరగడంతో ఒక్కో బీరుపై సగటున రూ.20 నుంచి రూ.30 వరకు ధర పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరల పెంపు నిర్ణయం దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత జరిగింది. బీర్ల ధరలు పెరగడానికి కారణం గతంతో పోలిస్తే ముడి సరుకుల ధరలు పెరిగాయి. ఉత్పత్తిదారుల విజ్ఞప్తులు, పక్క రాష్ట్రాల్లో ధరలను అధ్యయనం చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో 15 శాతం ధరలు పెంచుకోవచ్చని చెప్పింది.

Also Read: Google: 247 మిలియన్ల ప్రకటనలపై గూగుల్ ఉక్కుపాదం!

Also Read: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!

 

telugu-news | latest-telugu-news | liquor prices | hikes liquor prices | latest telugu news updates | liquor prices hike | liquor prices are increase in telangana | today-news-in-telugu | breaking news in telugu | latest telangana news | telangana-news-updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు