/rtv/media/media_files/2025/07/07/7-years-old-boy-dies-of-heart-attack-2025-07-07-13-49-46.jpg)
7 years old Boy dies of heart attack
హైదరాబాద్‌లో గుండెపగిలే విషాదం చోటుచేసుకుంది. కాలుకు సర్జరీ చేస్తే గుండెపోటుతో బాలుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కాలికి సర్జరీ..
ఏడేళ్ల బాలుడి కాలుకు దెబ్బతగిలింది. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని టిఎక్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలుడి కాలుకు చీము పట్టిందని ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అనంతరం చీము పట్టిన కాలుకు సర్జరీ చేస్తుండగా.. వైద్యం వికటించి ఆ ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు.
అయితే ఆ బాలుడు గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు.