Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు వర్షాలు దంచుడే దంచుడు!

అరేబియా సముద్రంలో అల్పపీడనం తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

New Update
IMD: ఈసారి వర్షపాతం అధికమే.. చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ!

Weather Update

తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం త్వరలో తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల ఏపీ, తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ విధించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, నంద్యాల, కర్నూలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. 

ఇది కూడా చూడండి:Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

ఇది కూడా చూడండి:PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

మరో రెండు రోజుల్లో ఏపీకి..

ఇదిలా ఉండగా సాధారణంగా రుతుపవనాలు కేరళకు జూన్ 1వ తేదీన వస్తాయి. కానీ ఈ ఏడాది ముందుగానే వచ్చేశాయి. దాదాపుగా ఎనిమిదేళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు ఉంది. ఈ రుతుపవనాల వల్ల రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు కూడా మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. 

ఇది కూడా చూడండి:Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

Advertisment
తాజా కథనాలు