/rtv/media/media_files/2025/07/01/rajasaab-special-song-update-2025-07-01-16-43-17.jpg)
rajasaab special song update
ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న కామెడీ హర్రర్ 'రాజాసాబ్' పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'రాజా సాబ్' స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ పాటను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే మొదట ఈ స్పెషల్ సాంగ్ లో ప్రభాస్ సరసన స్టెప్పులేసేందుకు నయనతారను సంప్రదించారట. కానీ ఆమె ఒప్పుకోలేదని సమాచారం.
కరీనా కపూర్
కాగా, తాజా అప్డేట్ ప్రకారం.. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అంతేకాదు ఆమె భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్. కరీనా లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తెలుగులో ఐటమ్ సాంగ్ చేయడం ఇదే మొదటి సారి. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : ఇదేం పిచ్చిరా బాబు.. స్కూటీ ధర రూ.1లక్ష.. నంబర్ ప్లేట్ రూ.14 లక్షలు
Though, #TheRajaSaabTeaser Started to Show Us Vintage #Prabhas we Waiting for 😍 & His Fun Side after Ages 💥
— Prabhas Network™ (@PrabhasNetwork_) June 22, 2025
Actual Theme of #TheRajaSaab Started from Here 🥵🥵🔥 What a BANGER Teaser iss 💥
Mad Repeats with Goosebumps Music work by @MusicThaman ❤️🔥🔥pic.twitter.com/IP2CvdtH0p
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా ముగ్గురు యంగ్ బ్యూటీస్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో తమ గ్లామర్ తో కట్టిపడేసారు ఈ ముద్దుగుమ్మలు. "ది రాజా సాబ్" డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read: Kannappa Piracy: మంచు విష్ణు 'కన్నప్ప' కు పైరసీ దెబ్బ.. వేల సంఖ్యల్లో ఆన్ లైన్ లింకులు
Also Read : ఎంత ఆశ్చర్యం.. ఈ 3 పానీయాలు క్యాన్సర్ ప్రభావం తగ్గిస్తాయట.. నిపుణులు ఏం చెబుతున్నారో మీరు తెలుసుకోండి!!
Prabhas RajaSaab | rajasaab movie updates | kareena-kapoor