/rtv/media/media_files/2026/01/31/fotojet-95-2026-01-31-16-38-34.jpg)
A Woman Set Her Lovers Wife On Fire By Dousing Her With Petrol
Women Murder: నల్లగొండ జిల్లాలో శనివారం దారుణం జరిగింది. పసిబిడ్డ తల్లి అయిన ప్రియుడి భార్యను ఓ మహిళ పెట్రోల్ పోసి తగులబెట్టింది. నాంపల్లి మండలంలోని కేతెపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతెపల్లి గ్రామానికి చెందిన నగేష్ యాదవ్ అనే వ్యక్తికి పెళ్లి కాకముందునుంచే మీసాల సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. సూజాత కారణంగా గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా శనివారం నగేష్ భార్యను చంపడానికి సుజాత పక్కా ప్రణాళికతో కారం, కోళ్లను కోసే కత్తితో పాటు పెట్రోల్ తీసుకుని మమత ఇంటికి వెళ్లింది.
ప్రియుడు భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టేసిన మహిళ
— PulseNewsBreaking (@pulsenewsbreak) January 31, 2026
నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలంలోని కేతపల్లిలో జరిగిన దారుణ ఘటన
స్థానికంగా ఉండే నగేష్ యాదవ్ కు సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం
ఈ విషయంపై నగేష్ భార్య, సుజాత మధ్య గొడవ.. ఆమెపై పగ పెంచుకున్న సుజాత
ఈ క్రమంలోనే నిప్పంటించగా స్పాట్… pic.twitter.com/W1Hoy3LsAt
ఆ సమయంలో మమత తన ఆరునెలల బాబును ఎత్తుకుని ఉంది. అక్కడికి వెళ్లిన సూజాతకు, మమతకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో కోపంతో ఊగిపోయిన సూజాత తనతో తెచ్చకున్న పెట్రోల్‌ను మమతపై పోసి నిప్పంటించింది. దీంతో మమత(25) శరీరం పూర్తిగా కాలి.. ఆమె మరణించింది. అయితే మమత తన ఒళ్లో ఉన్న ఆరు నెలల బాలున్ని దూరంగా విసిరేసినప్పటికీ బాబు శరీరం 80 శాతం కాలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మంటల దాటికి మమత పెద్ద ఎత్తున అరుస్తూ.. వీధిలోకి వెళ్ళింది. అయితే అప్పటికే ఆమె పూర్తిగా కాలిపోయింది. ఆరు నెలల బాలుడిని స్థానికులు నాంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మమతపై పెట్రోల్ పోసిన సుజాత దగ్గర్లో ఉన్న నాంపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు ఎస్సై లింగారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Follow Us