ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే వారికి షాక్.. మొత్తం 5 డైవర్షన్లు.. కొత్త రూట్లు ఇవే!

సంక్రాంతి సెలవులు ముగియడంతో ఏపీ నుంచి తెలంగాణకు భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు మొత్తం 5 ట్రాఫిక్ డైవర్షన్లను ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

New Update
Traffic Diversions

సంక్రాంతి పండగ ముగిసిన నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు లక్షలాది వాహనాలు తరలివచ్చే అవకాశం ఉంది. అయితే.. నేషనల్ హైవే- 65 అంటే విజయవాడ-హైదరాబాద్ హైవేపై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక ప్రకటన చేశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ముందు జాగ్రత్తగా రోడ్ డైవర్షన్ చేపట్టినట్లు తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 

1) గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వెహికిల్స్.. 
గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లేలా డైవర్ట్ చేశారు.

 2) మాచర్ల నుంచి హైదరాబాద్ వచ్చే వెహికిల్స్ వాహనాలు :
మాచర్ల → నాగార్జునసాగర్  → పెద్దవూర → కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకునేలా డైవర్షన్ ఏర్పాటు చేశారు.

3) నల్లగొండ నుంచి  హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు :
నల్లగొండ→మార్రిగూడ బై పాస్→మునుగోడు→నారాయణపూర్→చౌటుప్పల్ నేషనల్ హైవే మీదుగా హైదరాబాద్ కు చేరుకోవాల్సి ఉంటుంది.

4) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు..
కోదాడ-హుజూర్నగర్-మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్ కు డైవర్షన్ ఉంటుంది.

5)NH 65 (విజయవాడ -హైదరాబాద్) హైవేపై చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయితే చిట్యాల నుండి భువనగిరి గుండా హైదరాబాద్ మళ్లించనున్నట్లు  చెప్పారు.

సంక్రాంతికి వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు సంతోషంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. వాహనదారులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా డైవర్షన్ అమలు చేస్తున్నామన్నారు. ఇందుకు వాహనదారులు సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. అత్యవసర సమయంలో 100కు డయల్ చేయాలని సూచించారు. 

Advertisment
తాజా కథనాలు