Komatireddy Raj Gopal Reddy: మంత్రి పదవి ఇవ్వకుంటే డైరెక్ట్ సీఎం అవుతా.. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని తెలిపారు. ఒకవేళ తాను మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అవుతానని వ్యాఖ్యానించారు.

New Update
Komatireddy Raj Gopal Reddy

Komatireddy Raj Gopal Reddy

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని తెలిపారు. ఒకవేళ తాను మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అవుతానని వ్యాఖ్యానించారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులతో ఈ ర్యాలీ నిర్వహించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కూడా ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజ్ గోపాల్ రెడ్డి పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. 

Also Read: కొత్తగూడెం మేయర్ ఎన్నికపై ఉత్కంఠ..మారుతున్న సమీకరణలు

తనకు పదవుల విషయంలో అడుక్కోవడం రాదని అన్నారు. మర్యదగా పార్టీ ఇచ్చిన మాటకు మంత్రి పదవి ఇవ్వాలని తేల్చిచెప్పారు. లేదంటే తానే పదవిని లాక్కునేలా చేసుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేయాల్సిందేనన్నారు. లేకపోతే తన టార్గెట్ అదే అంటూ సీఎం పదవిని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటినుంచి మునుగోడు నియోజకవర్గంను ప్రజలు చూసుకుంటే తాను రాష్ట్రాన్ని చూసుకుంటానని తెలిపారు.

 

Also Read: ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

రాష్ట్రంలో సమయం వచ్చినప్పుడు జెండా ఎగురవేద్దామన్నారు. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి వెంట మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కన్వీనర్ పబ్బురాజు గౌడ్, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. 

#Muncipal Election News #telangana #komatireddy rajgopal reddy #rtv-news #telugu-news
Advertisment
తాజా కథనాలు