/rtv/media/media_files/2026/02/13/telangana-2026-02-13-11-20-05.jpg)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన జయకేతనాన్ని ఎగురవేసింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో హస్తం పార్టీ అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీని సాధించి, మున్సిపాలిటీని తమ వశం చేసుకున్నారు.మొత్తం 15వార్డులు కాగా కాంగ్రెస్ 09 వార్డుల్లో విక్టరీ కొట్టింది. బీఆర్‌ఎస్ 05 వార్డుల్లో, స్వతంత్రులు 01 వార్డులో విజయం సాధించారు. ఈ విజయంతో నేరేడుచర్ల పట్టణంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. కార్యకర్తలు బాణాసంచా కాల్చి, అభ్యర్థులను భుజాన ఎత్తుకుని పట్టణ పురవీధుల్లో ఊరేగింపులు నిర్వహిస్తున్నారు.
Follow Us