Municpal Election Result: నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు కొనసాగిస్తోంది. నల్గొండ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. ఆరు మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది.

New Update
Congress

Congress

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోరు కొనసాగిస్తోంది. నల్గొండ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. ఆరు మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. చిట్యాల, దేవరకొండ, నందికొండ, మిర్యాలగూడ, చండూరు , హాలియాను కైవసం చేసుకుంది. చిట్యాలలో 12 వార్డులకు 9 చోట్ల గెలిచింది. దేవరకొండలో 20కి 10 స్థానాల్లో, నందికొండలో 12కి 11 చోట్ల విజయం సాధించింది. అలాగే మిర్యాలగూడలో 48 వార్డులకు 31, చండూరు 10కి 6, హాలియాలో 12కి 11 చోట్ల గెలిచింది. 

Also Read: స్టాలిన్ సంచలన నిర్ణయం.. మహిళల ఖాతాల్లోకి రూ.5 వేలు

ఖమ్మంలోని అయిదుచోట్ల కూడా హస్తం పార్టీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. వైరాలో 20 స్థానాలకు12 చోట్ల గెలిచింది. మధిరలో 22కి 18 చోట్ల, కల్లూరులో 20కి 12 చోట్ల గెలిచింది. సత్తుపల్లిలో 23కి 12 చోట్ల విజయం సాధించింది. ఇక ఏదులాపురంలో మొత్తం 32 వార్డులు ఉండగా ఇప్పటిదాకా 13 వార్డుల్లో గెలిచి ఇతర వార్డుల్లో కూడా దూసుకెళ్తోంది. 

Also Read: చెన్నూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

Advertisment
తాజా కథనాలు