KTR: మోదీ.. మీకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోండి.. కేటీఆర్ సంచలన పోస్ట్!

పర్యావరణంపై ప్రధానిగా మెదీ తన బాధ్యత, చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు. కంచగచ్చిబౌలి భూముల అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సూచించారు.

New Update
ktr modi

KTR letter to Modi on Kanchagachibowli land dispute

ర్యావరణంపై ప్రధానిగా తన బాధ్యత, చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఈ అంశంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసంపై ప్రధానమంత్రి మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే వెంటనే యాక్షన్ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. 

Also Read :  ఉద్యోగుల పై వివక్ష..ఖండించిన టీసీఎస్‌!

10వేల కోట్ల ఆర్థిక మోసం..

సెంట్రల్ యూనివర్సిటీ వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం 10వేలకోట్ల ఆర్థిక మోసానికి పాల్పడుతోంది. ఇప్పటికే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సీబీఐ, ఆర్బీఐ, సెబీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ సంస్థలకు ఆధారాలతో సహా కాంగ్రెస్ చేసిన పదివేల కోట్ల ఆర్థిక మోసం గురించి తెలియజేశాం. సుప్రీంకోర్టు పంపించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కూడా ఈ అంశంలో ఆర్థిక అవకతవకలు జరిగిన అంశాన్ని నిర్ధారించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల విభాగాల స్వతంత్ర విచారణ చేయాలని సూచించిందని కేటీఆర్ చెప్పారు. 

Also Read :  తిక్కకుదిరింది!.. టీ తాగుతూ యువకుడి రీల్.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో

ఇది కూడా చూడండి: AP: వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్

నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. అయితే నిసిగ్గుగా, అక్రమంగా వ్యవస్థలను మోసం చేసి పర్యావరణ విధ్వంసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. కంచ గచ్చిబౌలిలో చేసిన పదివేల కోట్ల రూపాయల ఆర్థిక అక్రమాలపైన వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి. ప్రధానిగా పర్యావరణ పరిరక్షణపై, ప్రధాని బాధ్యతల నిర్వహణపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటిగా కాదని.. కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదని నిరూపించుకోవాలంటూ సంచలన కామెంట్స్ చేశారు. 

ఇది కూడా చూడండి: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం

 

pm modi | today telugu news | hcu 400 acres issue | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu | latest telangana news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు