TCS: ఉద్యోగుల పై వివక్ష..ఖండించిన టీసీఎస్‌!

ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ పై మాజీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా ఉద్యోగుల పై వివక్ష చూపిస్తోందని వారు విమర్శిస్తున్నారు. ఆ ఆరోపణలను టీసీసీ ఖండించింది. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.

New Update
TCS: టీసీఎస్‌కు రూ.1600కోట్లు జరిమానా

TCS

ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.అమెరికా ఉద్యోగుల పై ఐటీ దిగ్గజం వివక్ష చూపిస్తోందని దక్షిణాసియా యేతర మాజీ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. దీని పై అమెరికాలో సమాన ఉపాధి అవకాశాల కమిషన్‌ దర్యాప్తు చేపట్టింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్‌ తన కథనంలో పేర్కొంది.

Also Read: Madhya Pradesh: భర్తను 36 సార్లు కత్తితో పొడిచి..ప్రియుడికి వీడియో కాల్ లో చూపించిన మైనర్‌ భార్య!

ప్రధానంగా 40 ఏళ్లు పైబడిన దక్షిణాసియా యేతర మాజీ ఉద్యోగులు టీసీఎస్‌ తీరు పై పక్షపాత లే ఆఫ్‌ లు అమలు చేస్తోందని ఆరోపణలు చేశారు.హెచ్‌1 బీ వీసా కలిగిన భారతీయ ఉద్యోగుల పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు.

Also Read:America-Gunturu: టెక్సాస్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం..గుంటూరు విద్యార్థిని దుర్మరణం!

ఈ ఆరోపణల్నిటీసీఎస్‌ ఖండించింది. ఈ మాటల్లోవాస్తవం లేదని కేవలం తప్పుదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నమని స్పష్టం చేసింది. తాము అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపింది.

ఇదేతరహా ఆరోపణలు గతంలో బ్రిటన్‌ లోని ఓ ఉపాధి ట్రైబ్యునల్‌ లోనూ వెలుగులోకి వచ్చాయి. అక్కడ ముగ్గురు టీసీఎస్‌ ఉద్యోగులు వయసు,జాతీయతాధారంగా వివక్షకు గురైనట్లు ఆరోపించారని ది గార్డియన్‌ నివేదించింది. ఇదిలా ఉండగా..ఇప్పటికే ఫలితాలను ప్రకటించిన టీసీఎస్‌..అమెరికా కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం గతేడాదితో పోలిస్తే 5.3 శాతం పెరిగి రూ. 64,479 కోట్లకు చేరిందని పేర్కొంది.

నాలుగో త్రైమాసికంలో ఉద్యోగుల తొలగింపు రేటు 13శాతంనుంచి 13.3 శాతం పెరిగిందని తెలిపింది. అమెరికా టారిఫ్ ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన అనిశ్చితి మధ్య 6.07లక్షల మంది ఉద్యోగులకు వేతన పెంపును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read: Gold: లక్షకు చేరువలో బంగారం.. ధర తగ్గే ఛాన్స్ ఉందా? కొనేందుకు ఇది సరైన సమయమేనా?

Also Read: Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా పైకి..

tcs | jobs | employees | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
తాజా కథనాలు