Viral Video: తిక్కకుదిరింది!.. టీ తాగుతూ యువకుడి రీల్.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో

బెంగళూరులోని మగడి రోడ్డులో ఓ యువకుడు నడిరోడ్డుపై కుర్చీలో కూర్చొని టీ తాగుతూ రీల్ చేశాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బెంగళూరు పోలీసుల కంట పడింది. దీంతో పోలీసులు అతడిని ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు.

New Update
viral video Bangalore

viral video Bangalore

Viral Video:  ఈ మధ్య రీల్స్ పేరుతో కొంతమంది చేస్తున్న విన్యాసాలు హద్దు మీరుతున్నాయి. లైకులు, కామెంట్లు, ఫాలోవర్లు, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రీల్స్ చేయాలనే అత్యుత్సహంతో ఏం చేస్తున్నారో కూడా ఆలోచించడం లేదు.  బస్సులు, రోడ్లు, రైల్వే స్టేషన్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ పేరుతో విన్యాసాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించడమే కాకుండా వారి ప్రాణాలను కూడా రిస్క్ లో పెడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ యువకుడు నడిరోడ్డుపై పుష్పరాజ్ అంటూ స్టెంట్ చేశాడు.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.

నడిరోడ్డుపై రీల్  

అయితే బెంగళూరులోని మగడి రోడ్డులో ఓ యువకుడు నడిరోడ్డుపై కుర్చీలో కూర్చొని టీ తాగుతూ రీల్ చేశాడు. పుష్ప రాజ్ మాదిరిగా కాలు మీద కాలేసుకుని రీల్ తీశాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బెంగళూరు పోలీసుల కంట పడింది. దీంతో పోలీసులు అతడిని ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. అనంతరం అతడు చేసిన రీల్ ఎక్స్ లో పోస్ట్ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల భద్రతకు ఇబ్బంది కలిగించే ఇలాంటి స్టెంట్ లు చేస్తే ప్రశంసల బదులు.. జరిమానా ఉంటుంది అని హెచ్చరించారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

 telugu-news | latest-news | viral-video | latest news latest news telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు