BREAKING: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!
TG: రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 30న రూ.2 లక్షలు రుణమాఫీ కానీ వారందరికీ రుణమాఫీ జరగనున్నట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల దాదాపు 4 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు
TG: రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 30న రూ.2 లక్షలు రుణమాఫీ కానీ వారందరికీ రుణమాఫీ జరగనున్నట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల దాదాపు 4 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు
త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. రేవంత్ కాంగ్రెస్ లైన్లోనే పని చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే సంచలన నిజాలు బయటకు వస్తాయన్నారు.
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఇళ్లు అద్దె కోసం వచ్చి యజమానిని చప్పారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం దోచుకుని ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఫింగర్ ప్రింట్స్ సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అబ్బయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
పత్తి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిదని హరీష్ రావు అన్నారు. రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్‌ను బోగస్ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుంటే, మార్కెట్ లో కనీస మద్దతు ధర దక్కట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి కొన్న భూములపై విచారణ జరిపిస్తున్నామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయన్నారు.
ఖమ్మంలో ఆహార, స్వీట్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 960 కేజీల క్వాలిటీ లేని అల్లం, వెల్లుల్లి పేస్ట్ పాకెట్లను సీజ్ చేశారు. నిబంధనలు, అనుమతులు లేని వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
గ్రూప్-3 పరీక్ష రాసి వస్తున్న తల్లిని చూసిన చిన్నారి అమ్మొచ్చిందంటూ సంబరపడింది. తల్లిని హత్తుకునేందుకు గుమ్మం వైపు పరుగు తీసింది. కానీ అమ్మను చేరక ముందే ఆ బిడ్డ గుండెపోటుతో కుప్ప కూలింది. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
లేడీ అఘోరీ తెలంగాణలో మళ్లీ ప్రత్యక్షమైంది. ఖమ్మం జిల్లా మధిరలో దర్శనమిచ్చింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. అదే సమయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని అఘోరీ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.