తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు!

తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపి కబురు అందించారు. సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేశామని, లబ్ది దారులందరికీ న్యాయం చేస్తామన్నారు.

author-image
By srinivas
New Update
Ponguleti 2

Ponguleti: తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీపి కబురు అందించారు. సంక్రాంతి పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేశామని, లబ్ది దారులందరికీ న్యాయం చేస్తామన్నారు. అలాగే సంక్రాంతి పండుగకే రైతులకు రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం డిసెంబర్ 5న యాప్‌ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. 

కావాలనే కుట్రపూరితంగా ప్రచారం..

ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడిన పొంగులేటి.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపట్టబోతుందని చెప్పారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతూ నిరుద్యోగుల కళ్లలో ఆనందం చూస్తున్నాం. ఇప్పటికే 50 వేల మందికి నియామక పత్రాలు అందించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆరోగ్యశాఖపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నాం. గురుకులాలపై కావాలనే కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు