TS: వివాదంలో భద్రాచలం లడ్డూ.. అలా ఎందుకు చేశారు?

భద్రాచలం లడ్డూ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. దేవాలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీలో వాడే నెయ్యిని విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల్ని భద్రాచలం ఆలయ అధికారులు పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

New Update
Bhadrachalam : అయోధ్య రాముడు నడయాడిన తెలుగు నేల భద్రాచలం

 తెలంగాణలో దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి విజయా నెయ్యి వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే దీనిని భద్రాచలం దేవాలయ అధికారులు పక్కన పెట్టారు. ఇక్కడ ప్రసాదాల తయారీ కోసం ఓ ప్రైవేటు డెయిరీకి నెయ్యి సరఫరా టెండర్‌ను ఇచ్చారు. ఒక పక్క ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదు పైగా ఇప్పుడు పిలిచి టెండర్ ఇచ్చిన ప్రవైటు డెయిరీ..మొదట్లో ఈ-టెండర్లు పిలిచినప్పుడు డిస్‌క్వాలిఫై కూడా అయిందని తెలుస్తోంది.అయితే తర్వా ఏం జరిగిందో తెలియదు కానీ.. ఈ-టెండర్లను పక్కనపెట్టి సీల్డ్‌ కవర్‌ టెండర్లను పిలిచి ఎల్‌-1 పేరుతో ప్రైవేటు డెయిరీకి నెయ్యి సరఫరా ఆర్డర్‌ అప్పగించారు.

ముందు నో చెప్పి తరువాత ఇచ్చారు..

భద్రాచలం  దేవాలయానికి పన్నెండేళ్ళుగా కరీంనగర్‌ డెయిరీ నెయ్యి సరఫరా చేస్తోంది. కొంత కాలం క్రితమేఈ డెయిరీ కాంట్రాక్టు గడువు ముగిసిపోయింది. దీంతో జూన్‌లో అధికారులు నెయ్యి సరఫరాకు ఈ-టెండర్లు పిలిచారు. కరీంనగర్‌ డెయిరీతోపాటు ఏపీలోని జంగారెడ్డిగూడెం సమీపంలోని రైతు డెయిరీ కూడా ఇందులో పాల్గొంది. కిలో నెయ్యికి కరీంనగర్‌ డెయిరీ జీఎస్టీతో కలిపి రూ.610 కు టెండర్ వెయ్యగా.. రైతు డెయిరీ రూ.534.24 కోట్‌ చేసింది. అప్పుడు రైతు డెయిరీ ఎల్‌-1గా నిలిచింది. అయితే ప్రధాన ఆలయాలకు రెండేళ్లపాటు నెయ్యి సరఫరా చేసిన అనుభవం, ఏడాదికి రూ.10 కోట్ల టర్నోవరు ఉండాలన్న టెండరు నిబంధనల్లో రైతు డెయిరీ అర్హత సాధించలేకపోయింది. దీంతో రైతు డెయిరీని ఆలయ అధికారులు డిస్ క్వాలిఫై చేశారు. నోట్ కూడా రాఏశారు. కానీ ఇప్పుడు ఆ నోట్‌నే చింపేసి మరీ రైతు డెయిరీకి కాంట్రాక్ట్ అప్పగించారని తెలుస్తోంది. 

ఇక తిరుమల లడ్డూ వివాదం తరువాత ప్రసాదాల్లో వాడే నెయ్యి గురించి ప్రభుత్వం జాగ్రత్తు తీసకుంది. ఇక నుంచి ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీ నుంచే నెయ్యి తీసుకోవాలని ఆగస్టు 22న దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత దేవాదాయశాఖ అప్పటి కమిషనర్‌ ఎం.హన్మంతరావు కూడా ఆగస్టు 28న ఇదే విషయమై అన్ని ఆలయాలకు మెమో పంపించారు. అయితే ఇవి అందిన తర్వాతనే భద్రాచలం ప్రసాదాల తయారీకి నెయ్యి కాంట్రాక్ట్‌ను రైతు డెయిరీకి అప్పగించారు. అందుకే ఇప్పుడు ఈ విషయం వివాదంగా మారింది. 

Also Read: Big Twist: అల్లు అర్జున్ కేసులో ట్విస్ట్.. బెయిల్ రద్దు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు