TG Govt: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!

రైతు భరోసాపై లిమిట్ పెట్టాలని తెలంగాణకి కేబినేట్ సబ్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు గ్రూప్-1 ఆఫీసర్లకు రైతు భరోసా ఇవ్వకూడదని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.

New Update
farmers-RTV

గత ప్రభుత్వం బీఆర్‌ఎస్ రైతు భరోసా పథకానికి లిమిట్ పెట్టలేదు. కానీ ఇకపై రైతు భరోసాపై లిమిట్ పెట్టాలని కేబినేట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. దీంతో రేవంత్ సర్కార్ లిమిట్ పెట్టాలని చూస్తోంది. కొందరు 5 ఎకరాలు లేదా 7 ఎకరాల వరకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు రేవంత్ సర్కార్ భావిస్తోంది.

ఇది కూడా చూడండి:  పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!

90 శాతానికి పైగా వీరే..

రాష్ట్రంలో ఉన్న భూములను పరిశీలిస్తే 5 ఎకరాల వరకు ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. 90 శాతానికి పైగా వీరే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రైతు భరోసా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు గ్రూప్-1 ఆఫీసర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది.

ఇది కూడా చూడండి:  తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

మొత్తం అన్ని భూములకు ఎకరాకు రూ.7500 ఇచ్చిన దాదాపుగా ఈ సీజన్‌కు రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతాయి. అదే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇన్‌కమ్ ట్యాక్సపేయర్స్‌కు ఇవ్వకపోతే ఈ మొత్తంలో కొంత తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా దాదాపుగా రూ.15 లక్షల ఎకరాల భూములకు రైతు భరోసా ఇవ్వక్కర్లేదు. దీనివల్ల కొంత నష్టం ఉండదని భావిస్తోంది.

ఇది కూడా చూడండి: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

ఇలా చేయడం వల్ల దాదాపుగా రూ.1500 కోట్ల వరకు ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఎంత రైతు భరోసా? ఎవరెవరికి ఇవ్వాలి? ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే? పూర్తి విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నారు. అయితే సంక్రాంతి తర్వాత రైతుల అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే. 

ఇది కూడా చూడండి:  'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు