వ్యవసాయంలో లాభాలు రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. రఘునాథపాలెం మండలం కోటపాడుకి చెందిన ఓ యువ రైతు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గునిపిన్ని భూపతి రావుకి నాలుగు ఎకరాలు ఉంది. దీనికి ఇంకో పది ఎకరాల భూమిని కౌలుకి తీసుకున్నాడు. ఇది కూడా చూడండి: నేడే "బిగ్ బాస్-8" లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు! అప్పులు తీర్చలేక.. పురుగుల మందు తాగి.. పంటలు పండించే సమయలో ట్రాక్టర్ తప్పకుండా ఉండాలని.. సొంతంగా ఒక ట్రాక్టర్ కూడా తీసుకున్నారు. దీనికి తోడు ఇంటికి మరమ్మతులు చేయించడంతో పాటు అప్పు బాగా పెరిగింది. ఇంతలో కుటుంబ ఖర్చులు అన్ని అయ్యే సరికి అప్పులు తీర్చడం ఎలా అని మానసిక ఆవేదన చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే తన భార్యకు ఈ విషయం చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. మార్గమధ్యంలోనే భూపతిరావు మృతి చెందాడు. ఇది కూడా చూడండి: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల ఇదిలా ఉండగా.. ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో దారుణం చోటుచేసుకుంది. గంగాధరం అనే వ్యక్తికు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం అతడు సునీత అనే ఓ మహిళ ఇంటి గదిని అద్దెకు తీసుకుని కిరాణా షాప్ నడిపాడు. ఆ షాపు మీద వచ్చిన డబ్బులతోనే భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. షాప్ పెట్టి రెండు మూడు వారాలే అయిన వ్యాపారం బాగా జరిగింది. ఇది చూసిన యజమాని ఆ గదిని ఖాళీ చేయమని బెదిరించింది. తనకి మూడు నెలల సమయం కావాలని గంగాధరం అడిగిన కూడా ఒప్పుకోలేదు. ఇది కూడా చూడండి: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక! సునీత చెప్పినా గంగాధరం పెడచెవిన పెట్టడంతో, సునీత అక్క కొడుకు చక్రి తన స్నేహితులతో కలిసి గంగాధరాన్ని బెదిరించి దాడి చేసారు. అయినా గంగాధరం వారికి సర్ది చెబుతూ సమయం కావాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఇంటి యజమాని సునీత పోలీసులను ఆశ్రయించింది. వారు అతన్ని రక్తం వచ్చేలా కొట్టి గ్రామంలో విడిచి వెళ్లారు. దీంతో పరువు పోయిందని గంగాధరం మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కూడా చూడండి: Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!