Gold:పెట్టడమే సరైన మార్గం. మనం దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంక్ అధికారులు అన్ని పరీక్షలు చేసి అసలైనదేనా? నకిలీదా? అని నిర్ధారించి తర్వాత డబ్బులు ఇస్తారు. ఓ ముఠా మాత్రం నకిలీ బంగారంతో బ్యాంక్ అధికారులను బురిడి కొట్టించాడు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా రూ. 100 కోట్లు గోల్డ్‌లోన్ తీసుకుని మోసం చేశాడు. ఘటన తాజాగా తెలంగాణంలో చోటుచేసుకుంది.
నకిలీ బంగారం తాకట్టు పెట్టి..
ఖమ్మం నకిలీ గోల్డ్‌లోన్ స్కాం కలకలం రేపుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఘటనలో చోటుచేసుకుంది. ఈ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షేక్ రహీమ్ పాషా, భూక్యా మల్సూర్, బానోత్ శంకర్ సహా పలువురు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ. కోటి వరకు రుణాలు తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 26 మందిపైగా పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారమే నకిలీ ఆభరణాలు తయారీ చేసి బ్యాంకుల్లో తనఖా పెట్టినట్లు తెలుసుకోంది. ఈజీ మనీ కోసం ముఠాలుగా ఏర్పడి బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారు. పలు బ్యాంకుల్లో అప్రైజర్ల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: జ్ఞాపకశక్తిని పెంచే అద్భుత ఆహారాలు ఇవే
తాజాగా భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంకులో స్కాం జరిగినట్లు సిబ్బంది గుర్తించారు. ఘటనపై ఇప్పటికే పోలీసులకు బ్యాంకర్లు ఫిర్యాదు చేశారు. విషయం బయటకు రాకుండా పోలీసు ఉన్నతాధికారులను బ్యాంకర్లు కోరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ ఆభరణాల తయారీ ఎక్కడ జరిగింది..? సూత్రధారి ఎవరు..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ గోల్డ్‌లోన్ స్కాంపై RTV వరుస కథనాలతో బ్యాంకుల తనఖాలోని ఉన్న ఆభరణాలను రీ అప్రైజింగ్ సిబ్బంది చేస్తున్నారు. ఈ నేపథ్యంలో RTV చేతికి గోల్డ్‌లోన్ రాకెట్ మాఫియా లిస్ట్ చిక్కింది.
Also Read: ఫ్యాటీ లివర్ కేసులు పెరగడానికి కారణాలు ఇవే