VIRAL NEWS: ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావేంట్రా.. ‘సీఎం రేవంతన్న కుదిర్చిన ముహూర్తానికే నా పెళ్లి.. లేదంటే’!

సీఎం రేవంత్ రెడ్డి తన పెళ్లికి వస్తేనే తాను తాళి కడతానని ఖమ్మం జిల్లా మేకల తండాకు చెందిన భూక్యా గణేష్ తెలిపాడు. ఆహ్వాన పత్రాన్ని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు అందించాడు. ఆయన దానిని సీఎంఓకు పంపించారు. ఆ వినతి పత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Khammam Congress worker ganesh

Khammam Congress worker ganesh

సాధారణంగా సెలబ్రెటీలకు అభిమానులు ఉండటం సహజమే. కొందరికైతే వీరాభిమానులు ఉంటారు. హీరో, హీరోయిన్, స్పోర్ట్స్ పర్సన్స్, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు.. ఇలా చాలా మందికి తమ తమ అభిమానగళం ఉంది. ముఖ్యంగా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఒక రాజకీయ నాయకుడి బర్త్ డే వస్తుందంటే.. వీరాభిమానులు రక్త దానం, అన్నదానం, ఆశ్రమాల్లో బట్టలు పంచడం ఇలా చాలా చేస్తారు. 

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

మరికొందరు తమ అభిమాన నాయకుడు వస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పిన వీడియోలు ఇప్పటి వరకు చాలానే చూశాం. తాజాగా అలాంటి పరిణామమే మరొకటి తెలంగాణలో చోటుచేసుకుంది. తమ అభిమాన నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డి వస్తేనే.. తాను పెళ్లి చేసుకుంటానని ఓ కార్యకర్త మొండిపట్టు పట్టాడు. ఆయన సమక్షంలోనే తాను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. తాను నిర్ణయించిన డేట్‌కు ఆయన రావడానికి కుదరకపోతే.. సీఎం రేవంత్ అన్నకు ఏ రోజు వీలుంటుందో.. ఆ రోజే పెళ్లి చేసుకుంటానని ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!

కార్యకర్త వినూత్న వినతి

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మేకల తండాకు చెందిన భూక్యా గణేష్‌.. సీఎం రేవంత్ రెడ్డికి వీరాభిమాని. అతడు యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా కూడా ఉన్నాడు. గణేష్‌కు ఇటీవల పెళ్లి కుదిరింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలో అతడు ఎంతగానో అభిమానించే సీఎం రేవంత్ రెడ్డికి వినూత్న వినతి అందించాడు. తన పెళ్లికి స్వయంగా హాజరుకావాలంటూ దరఖాస్తు రాశాడు. అందులో సీఎం రేవంతన్న వస్తేనే పెళ్లి పీటలెక్కుతానంటూ భూక్యాగణేష్ తెలిపాడు. అంతేకాకుండా తాను ఖరారు చేసిన డేట్ కుదరకురకపోతే.. సీఎంకు కుదిరిన డేట్ రోజునే పెళ్లి ముహుర్తం పెట్టుకుంటానని స్పష్టం చేశాడు. 

viral-news | cm-revanth-reddy | latest-telugu-news

Also Read :  ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !

ఈ మేరకు ఆ దరఖాస్తుతో పాటు.. సీఎం ఆహ్వాన వినతిపత్రాన్ని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు అందించాడు. దీంతో కార్యకర్త గణేష్ వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దాన్ని సీఎంవోకు పంపారు. గణేష్ సింగరేణి మండలంలో పార్టీ ముఖ్యమైన నేత అని.. పెళ్లికి హాజరవ్వాలని.. కుదిరితే పెళ్లి ముహూర్తం తేదీ ఖరారు చేయాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పేర్కొన్నారు. దీంతో ఆ వినతి పత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు సీఎం వస్తాడా? గణేష్ పెళ్లి పీటలెక్కుతాడా ? అంటూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చ మొదలైంది. 

Also Read :  కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

 

today-news-in-telugu | breaking news in telugu | latest telangana news | telangana news live | telangana news today | telangana news live updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు