TG Internet Scheme: కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ‘భారత్‌ నెట్‌’ప్రాజెక్టులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు రూ.300కే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వనుంది. టీ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ పనులు ప్రారంభించింది. 

New Update
t fiber

Telangana govt provide internet every home

తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ‘భారత్‌ నెట్‌’ప్రాజెక్టులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు రూ.300కే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు 2025 చివరి నాటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చేదిశగా సన్నాహాకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 12,751 గ్రామ పంచాయతీలను ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ (OPC)తో అనుసంధించే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 

5,001 గ్రామ పంచాయతీలకు కనెక్ట్‌

ఈ మేరకు T ఫైబర్‌ పనులను త్వరగా పూర్తిచేసి ఇంటింటికీ ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఇచ్చి 2028 నాటికి రూ.500 కోట్ల ఆదాయం పొందాలని ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే 5,001 గ్రామ పంచాయతీలను OPFతో కనెక్ట్‌ చేసింది. ఈ ప్రాజెక్టులో లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లను భాగస్వాములను చేయనుండగా.. దరఖాస్తులు ఆహ్వానించింది. దాదాపు 20 వేల కేబుల్ ఆపరేటర్లు, టెక్నీషియన్లకు ఉపాధి లభించనుంది. తొలి విడతలో 3 ఉమ్మడి జిల్లాలు రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం పరిధిలో ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌ పనులు ఆరంభించారు.  3,089 గ్రామలకు ఓఎఫ్‌సీని కనెక్షన్ ఇచ్చే బాధ్యత BSNLకు అప్పజెప్పారు. 

Also Read :  ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !

రింగ్‌ టెక్నాలజీ సక్సెస్..

ఇక రెండో దశలో ఏ తరహా లైన్స్ వేయాలనే అంశాన్ని ‘భారత్‌ నెట్‌’ రాష్ట్రాలకే వదిలేసింది. తెలంగాణ మాత్రమే ఓఎఫ్‌సీని భూగర్భంలో వేసే ‘రింగ్‌ టెక్నాలజీ’ని ఉపయోగించింది. 32 వేల కిలోమీటర్ల వరకు OFCని విస్తరించగా.. 3,500 కిలోమీటర్ల పొడవు కేబుల్స్‌ వేయనుంది. అయితే తెలంగాణలో ‘రింగ్‌ టెక్నాలజీ’సక్సెస్ కావడంతో మూడో దశలో అన్ని రాష్ట్రాలు రింగ్‌ టెక్నాలజీ అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ ఖర్చు మొత్తం తామే భరిస్తామని భారత్‌ నెట్‌ ప్రకటించింది. మరోవైపు రూ.1,779 కోట్లను కనీసం వడ్డీలేని రుణంగా  ఇవ్వాలని రేవంత్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. 

Also Read :  లిక్కర్ స్కామ్ లో సంచలనం.. మరో ఆడియో విడుదల చేసిన రాజ్ కసిరెడ్డి!

15 జిల్లాల్లో డిజిటల్‌ కనెక్టివిటీ..

ఇప్పటికే 4 గ్రామాల్లో డిజిటలైజేషన్‌ చేపట్టాం. హాజిపల్లి (రంగారెడ్డి జిల్లా), సంగుపేట (సంగారెడ్డి), మద్దూర్‌ (నారాయణపేట),  అడవి శ్రీరాంపూర్‌ (పెద్దపల్లి) జిల్లాలో ప్రతి ఇంటికీ ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఇచ్చాం. 3 కాంట్రాక్టు సంస్థలు 3 నెలల పాటు ఇంటర్‌నెట్‌ సేవలు ఉచితంగా అందిస్తాయి. ఒక్కో వినియోగదారుడి నుంచి రూ.300 వసూలు చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 70శాతం ఇళ్లు 30 శాతం లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లు, 31శాతం DTH, మరో 39 శాతం ఇంటర్‌నెట్‌ ద్వారా డిజిటల్‌ కనెక్టివిటీ కలిగివున్నాయి. వీటన్నింటికి త్వరలోనే టీ ఫైబర్‌ సేవలు అందుబాటులోకి తెస్తామని టీ ఫైబర్‌ ఎండీ వేణుప్రసాద్ స్పష్టం చేశారు. అంతేకాదు 15 జిల్లాల్లో డిజిటల్‌ కనెక్టివిటీ పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. 

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

మహబూబ్‌నగర్, జనగామ, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, వరంగల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో ప్రాజెక్టు నడుస్తోంది. నల్గొండ, నాగర్‌కర్నూల్‌, మెదక్, సూర్యాపేట, సంగారెడ్డిలో భారత్‌ నెట్‌ పనులు మొదటి దశలో ఉన్నాయి. ఇక సాంకేతిక సమస్యలు తలెత్తిన మేడ్చల్‌– మల్కాజిగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డిలో పనులు మొదలుకానున్నాయి. పనులు ఆగిన ఆదిలాబాద్, భూపాలపల్లి, నిర్మల్, మహబూబాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగులోనూ మళ్లీ ప్రారంభించేందుకు అన్ని సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో

ఇక రాష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీలుండగా 5001 పంచాయతీల్లో భారత్‌ నెట్‌ పనులు పూర్తయ్యాయి. 3888 పనుల ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 773 పంచాయతీలకు అటవీ అనుమతులు కావాలి. 3089 పంచాయతీల్లో మొదటి దశ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక HMDA పరిధిలో 18 లక్షల గృహాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాల్సివుంది.  

 

telugu-news | internet | today telugu news | cm revanth | latest-telugu-news | breaking news in telugu | latest telangana news | telangana news live updates | telangana news today | telangana-news-updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు