/rtv/media/media_files/2025/04/21/vtOXD0Smc6lP5ahhW8w6.jpg)
Hamas
హమాస్‌ను అంతం చేయాలనే లక్ష్యంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే హమాస్ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో హమాస్ మరో ప్లాన్ వేసింది. ఇప్పడు తమ సైన్యంలో చిన్న పిల్లలు, యువతను నియమించుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే దాదాపు 30 వేల మంది యువతను 'ఇజ్ అద్ దిన్ అల్ ఖస్సం బ్రిగేడ్'లో చేర్చుకొన్నట్లు సౌదీ అరేబియాకి చెందిన అల్ అరేబియా ఛానెల్ తెలిపింది.
అయితే వీళ్లలో చాలామంది గతంలో శిక్షణకు హాజరైనవాళ్లు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. కానీ ఆ క్యాంపు ఇప్పటికీ ఉందా ? లేదా ? అనే దానిపై స్పష్టత లేదని చెప్పింది. అంతేకాదు కొత్తగా హమాస్‌లో చేరిన వాళ్లకి గెరిల్లా యుద్ధతంత్రం, రాకెట్లను ప్రయోగించడం, బాంబులు అమర్చడం తప్పా ఇంకా ఇతర స్కిల్స్ లేవని తెలిపింది. వీళ్ల నియామకాలు కూడా కచ్చితంగా ఎప్పుడు జరిగాయో అనేదానిపై కూడా క్లారిటీ లేదని పేర్కొంది. అయితే ఈ ఏడాది జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం రద్దయిన తర్వాతే వీళ్లు గ్రూప్‌లోకి వచ్చి ఉండొచ్చని తెలిపింది.
Also Read: అలెర్ట్.. చలామణిలో రూ.500 ఫేక్ నోట్లు..
Also Read : సింగర్ సునీత ఇలాంటిదా..! కంటెస్టెంట్ ప్రవస్తి మాటలు వింటే మతిపోతుంది..
Hamas Recruited 30,000 Gaza Youths
ఇదిలాఉండగా ప్రస్తుతం హమాస్ ఆయుధాలు, డోన్లు, క్షిపణుల కొరత ఎక్కువగా ఉంది. నిధులు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సంస్థలో ఉంటున్న సభ్యులకు కూడా చెల్లింపులు చేయలేని పరిస్థితి వచ్చింది. గాజాలోకి వెళ్లే మానవీయ సాయంలో ఇజ్రాయెల్ భారీగా కోత విధించింది. దీంతో హమాస్‌కు వాటిని దోచుకుని విక్రయించే ఛాన్స్ కూడా లేదని అల్ అరేబియా ఛానెల్ తెలిపింది.
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ముందు ప్రతినెల దాదాపు 15 మిలియన్ డాలర్లు గాజాకు ఖతార్ నుంచి వచ్చేవి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 500 మిలియన్ డాలర్ల నిధులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవి. అయితే గాజాలో పోరు మొదలైన తర్వాత నిధులు రాక తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఆర్థిక సంక్షోభం కూడా నెలకొంది.
Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?
Also Read : పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇలానే.. తర్వాత పోప్ ఎవరు?
israel-hamas-war | international news in telugu | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu