BIG BREAKING: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!

మావోయిస్టుపార్టీకి బిగ్ షాక్ తగిలింది. జార్ఖండ్ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంఝీ హతమైనట్లు పోలీసులు తెలిపారు. వివేక్‌తో పాటు అతని స్క్వాడ్ మొత్తాన్ని వాష్ అవుట్ చేసినట్లు వెల్లడించారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది. 

New Update
maoist killed

Jharkhand encounter Maoist leader Vivek killed police

Maoist: మావోయిస్టుపార్టీకి బిగ్ షాక్ తగిలింది. జార్ఖండ్ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంఝీని హతమైనట్లు పోలీసులు తెలిపారు. వివేక్‌తో పాటు అతని స్క్వాడ్ మొత్తాన్ని వాష్ అవుట్ చేసినట్లు వెల్లడించారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది. 

లుగు కొండప్రాంతాల్లో..

ఈరోజు తెల్లవారుజామున బొకారో జిల్లా లాల్ పానియాలోని లుగు కొండప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంఝీని మట్టుబెట్టినట్లు భధ్రతాబలగాలు తెలిపాయి. అగ్రనేత వివేక్ కోసం నెలలపాటుగా అడవిని జల్లెడపట్టినట్లు వెల్లడించాయి. ఎట్టకేలకు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాల జాయింట్ ఆపరేషన్లో వివేక్ ఎన్ కౌంటర్ జరిగిందని, అతనిపై కోటిరూపాయల రివార్డు ఉన్నట్లు వెల్లడించాయి.

Also Read: 'కింగ్‌డమ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్‌ లోడింగ్..!

వివేక్ స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ జిల్లా తుండి. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్ ఘఢ్, ఒడిశా రాష్ట్రాల్లో జరిపిన విధ్వంసకర ఘటనల్లో వివేక్ హస్తం ఉంది. మొత్తం 50 కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. గెరిల్లా యుద్ధతంత్రాల్లో ఆరితేరిన వ్యక్తి. చలపతి తరువాత మరో కీలకమైన కేంద్రకమిటీ సభ్యుడుగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. 

Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే..?

ఇక కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సోమవారం ఉదయం మవోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. బొకారో జిల్లాలో CRPF కోబ్రా కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.  'లాల్పానియా ప్రాంతంలోని లుగు హిల్స్‌లో ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. 209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో ఆరుగురు నక్సల్స్ మరణించారు. ఒక INSAS రైఫిల్, ఒక సెల్ఫ్-లోడింగ్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని, పోలీసు బలగాలు, నక్సల్స్ మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. 

encounter | jharkhand | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు