/rtv/media/media_files/2025/04/20/MbQr5zODo9qkrmEMCNp8.jpeg)
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆస్తి వివాదాలు,కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసు వర్గాలు వలెల్డించిన వివరాల ప్రకారం..ఆదివారం మధ్యాహ్నం ఓం ప్రకాశం,ఆయన భార్య పల్లవి గొడవపడ్డారు. అది తీవ్ర రూపం దాల్చడంతో పల్లవి ఆయన పై కారప్పొడి చట్టి , కట్టేసిందని ,తర్వాత అతడిని పొడిచి చంపిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Also Read: Bollywood:లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరో హీరో ను చంపేస్తామంటూ బెదిరింపులు!
ఈ క్రమంలో ఆమె ఒక గ్లాస్ బాటిల్ ను ఉపయోగించిందని చెప్పారు. తర్వాత నిందితురాలు మరో పోలీసు అధికారి భార్యతో మాట్లాడారు. తన భర్తను తానే చంపేసినట్లు చెప్పారు. దాంతో వెంటనే ఈ ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది.
ఓం ప్రకాశ్ తన బంధువుకు ఒక ఆస్తిని బదిలీ చేశారని,ఆ విషయంలో జరిగిన గొడవే ఈ పరిస్థితి దారితీసిందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు.మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ హత్యలో మృతుడి కుమార్తె పాత్ర పై ఆరా తీస్తున్నారు. పల్లవి గత 12 ఏళ్లుగా స్కిజోఫీనియాతో బాధపడుతోందని ,చికిత్స కూడా పొందుతోందని ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: Trump Vs Harvard: హార్వర్డ్ పై మరో దాడికి రెడీ అయిన ట్రంప్
తనకు తన భర్త నుంచి ప్రమాదం ఉందని తరచూ భయపడేదని, ఊహజనితమైన ఆలోచనలతో ఆందోళనకు గురయ్యేందని తెలిపారు. ఆ భయంతోనే ఆమె ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ చంపారన్ కు చెందిన వ్యక్తి. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి,2017 లో పదవీ విరమణ చేశారు.
Also Read: China-America: అమెరికాతో ట్రేడ్ డీల్ మ్యాటర్ లో జాగ్రత్త..చైనా హెచ్చరికలు
karnataka | Former DGP | murder | wife | ballari | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates