TG Crime: కొండగట్టులో బీరు బాటిళ్లతో యువకుడి దారుణ హత్య
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నస్వామి మెట్లదారి సమీపంలో రమణారెడ్డి అనే యువకుడిని బీరు బాటిళ్లతో హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గుడి పక్కనే ఉన్న ప్రాంతంలో పూడ్చేశారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.