/rtv/media/media_files/2024/12/25/GvAj4HDhDCkyu9CYz4xn.jpg)
Vemulavada Temple
Vemulawada Temple : దక్షిణ కాశీగా పేరుగాంచిన తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ప్రసద్ధ పుణ్యక్షేత్రల్లో ఒకటి. ఆలయంలోని ప్రధాన దైవం రాజరాజేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారని భక్తుల విశ్వాసం. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలనుంచి కూడా వేలాదిగా భక్తులు దర్శనాల కోసం వస్తుంటారు. ప్రతి రోజు భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే ఆలయాన్ని నేటి నుంచి (ఆదివారం) వేములవాడ రాజరాజేశ్వర స్వామి అలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: వీడు కొడుకు కాదు.. రాక్షసుడు.. ఆస్తి కోసం తల్లిని గొంతు నులుమి హత్య
వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి అలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వామివారికి సమర్పించే అన్ని రకాల ఆర్జిత సేవలు, కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, నిత్యకల్యాణం, చండీహోమం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు భీమేశ్వర సన్నిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. శ్రీరాజరాజేశ్వర ఆలయంలో కేవలం ఏకాంత సేవలు మాత్రమే నిర్వహించటం జరుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తులందరూ దీనికి సహకరించాలని అధికారులు కోరారు. అయితే రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా దర్శనాల నిలిపివేత కొన్ని నెలలు పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : వీడు కోచ్ కాదు...కామాంధుడు..వాలీబాల్ కోచ్ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్య
వేములవాడ రాజన్న గుడి విస్తరణలో భాగంగా కొన్ని నెలల పాటు దర్శనాల నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు. అదే విధంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు,నైవేద్యాలు, ఇతర అన్నిరకాల కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఆలయం డెవలప్ మెంట్ పనులు పూర్తయ్యాక మరల దర్శనాలకు అనుమతినిస్తామని భక్తులు ఈ విషయాల్ని గమనించాని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
బండి సంజయ్ వార్నింగ్
వేములవాడ రాజన్న ఆలయం మూసివేతపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు.భక్తుల మనోభావాలను కించపరిస్తే చూస్తూ ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆలయం మూసివేస్తే కార్యకర్తలతో వెళ్లి తలుపులు తెరుస్తామంటూ హెచ్చరించారు.రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నాయకులు సిద్ధంగా ఉండాలంటూ బండి పిలుపునిచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
దేశంలో ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం...ఐనప్పటికీ ఎక్కడా ఆలయాలను మూసివేయలేదని బండి స్పష్టం చేశారు.యాదాద్రిలోనూ బాలాలయం ప్రతిష్ట చేసిన తర్వాతే అభివృద్ధి విస్తరణ పనులు చేపట్టారని గుర్తు చేశారు. ఆలయాన్ని ఎన్ని రోజులు మూసివేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆకస్మాత్తుగా ఆలయాన్ని మూసివేస్తామంటే ఒప్పుకోమంటూ ఆయన సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. అయితే గతంలోనూ ఆలయ మూసివేత అంశాన్ని పలువురు వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: 13 ఏళ్ల దొంగను ఉరికించి ఉరికించి.. ఈ పాప ధైర్యానికి అందరూ షాక్!