/rtv/media/media_files/2025/10/07/rape-2025-10-07-14-24-33.jpg)
Girl gang raped.. then video recorded..
Crime News: సోషల్ మీడియా ప్రభావం, మత్తుపదార్థాల వాడకం మూలంగా నేటి కాలంలో కామాంధుల సంఖ్య పెరిగిపోతుంది. అమ్మాయిలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిదిలో ఘోరం చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇది కూడా చూడండి: Telangana Rising Vision-2047 : రాష్ట్రంలో మరో సర్వే!.. తెలంగాణలో మరో సర్వే...తెలంగాణ రైజింగ్ విజన్-2047 పేరిట ప్రారంభం
వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా అత్యాచారాన్ని సెల్ ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరు యువకులు కొంతకాలంగా బాలికతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వారు మత్తు పదార్థాలకు అలవాటు పడటంతో పాటు ఆమెకు కూడా అలవాటు చేసినట్టు తెలుస్తున్నది. వారం రోజుల క్రితం ముగ్గురు కలసి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడి సమయంలో వీడియో చిత్రీకరించారు. అనంతరం మూడు రోజుల క్రితం ఈ వీడియోలను స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియోలు వైరల్గా మారాయి.
Also Read: Bigg Boss Promo: రెచ్చిపోయిన రీతూ.. డెమోన్ పవన్ గప్ చుప్! నామినేషన్స్ లో రచ్చ రచ్చ!
స్థానికంగా ఈ వీడియోలు వైరల్ కావడంతో బాలిక తల్లిదండ్రుల దృష్టికి వెళ్లింది. బాలికను విచారించగా జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో లైంగిక దాడికి పాల్పడిన విశ్వతేజ్, సన్నీపై చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు కొత్తపల్లి పోలీసుల ఆశ్రయించారు. స్థానిక ఏసీపీ విజయ్‌కుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐ బిల్లా కోటేశ్వర్ దర్యాప్తు జరిపి ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. సోమవారం వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో పలువురు యువకులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అడల్ట్ కంటెంట్‌ను చూసి బాలికలను లోబర్చుకుని వారికి కూడా మత్తు మందు అలవాటు చేయిస్తున్నారు. ఆ తర్వాత ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యువత మత్తుకు బానిసలు కావద్దని ఇటీవల ఇదే గ్రామంలో పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఈ ఘటన వెలుగు చూడటం సంచలనంగా మారింది.
ఇది కూడా చూడండి: Hyderabad : ఎల్‌బీనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురికి తీవ్రగాయాలు