BIG BREAKING: అడ్లూరికి మంత్రి పొన్నం క్షమాపణ-VIDEO

మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ మధ్య వివాదం సమసిపోయింది. ఈ రోజు పీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ తన నివాసంలో ఇరువురు మంత్రులతో బ్రేక్‌ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం అడ్లూరికి క్షమాపణ చెప్పారు పొన్నం.

New Update
Ponnam Prabhakar Vs Adluri laxman

మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ మధ్య వివాదం సమసిపోయింది. ఈ రోజు పీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ తన నివాసంలో ఇరువురు మంత్రులతో బ్రేక్‌ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వారితో చర్చలు జరిపారు. అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడారు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తాను అడ్లూరి లక్ష్మణ్‌ ను ఆ మాట అనలేదన్నారు. తనకు అలాంటి ఆలోచన లేదన్నారు. ఆ ఒరవడి లో పెరగలేదన్నారు. కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గంతో కలిసి తామంతా కలిసి పెరిగామని గుర్తు చేశారు. పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి తాను క్షమాపణలు కోరుతున్నానన్నారు. 

గత రెండు మూడురోజులుగా తెలంగాణ కాంగ్రెస్ లో 'దున్నపోతు' వ్యాఖ్యలు దుమారం రేపాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నకల నేపథ్యంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు ముందుగా పొన్నం ప్రభాకర్, వివేక్ హాజరయ్యారు. అడ్లూరి లక్ష్మణ్ రాక కాస్త ఆలస్యమైంది.

ఈ క్రమంలో జీవితం, సమయం గురించి మనకు తెలుసు.. ఆ దున్నపోతుకు ఏం తెలుసు? అని వివేక్ చెవిలో అన్నారు. దీంతో మంత్రి అడ్లూరిని ఉద్దేశించే పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారని దళిత సంఘాలు భగ్గుమన్నాయి. మంత్రి అడ్లూరి కూడా పొన్నం తీరుపై ఫైర్ అయ్యారు. తాను దళితుడిని కాబట్టే పొన్నం ఇలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ టికెట్లు బుక్ చేయడం ఆలస్యం కావడంతోనే తన వ్యక్తిగత సహాయకుడిని అలా అన్నానని పొన్నం చెప్పుకొచ్చారు. 

Advertisment
తాజా కథనాలు