Vemulawada Rajanna Temple: వేములవాడలో దర్శనాల వివాదం..పొంతనలేని ప్రకటనలతో అయోమయం

వేములవాడ రాజరాజేశ్వర ఆలయం విషయంలో అధికారుల పొంతనలేని ప్రకటనలతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. అభివృద్ధి, విస్తరణ పనుల నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.

New Update
Sri Raja Rajeshwara Swamy Temple

Sri Raja Rajeshwara Swamy Temple

Vemulawada : వేముల వాడ రాజరాజేశ్వర ఆలయం(Vemulawada Rajanna Temple) విషయంలో అధికారుల పొంతనలేని ప్రకటనలతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. అభివృద్ధి, విస్తరణ పనుల నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో అభిషేకాలు, అర్చనలు, పూజలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో భీమన్న ఆలయంలో ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి అక్కడే కోడె మెక్కులను ప్రారంభించారు. రాజన్న ఆలయంలో నిత్యం నిర్వహించే కోడెమొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, కుంకుమపూజ, నిత్యకల్యాణం, చండీహోమం తదితర పూజా కార్య్రమాలను ఈ నెల 11 నుంచి భీమేశ్వరస్వామి ఆలయం వద్ద నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు అదేరోజు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 12 (ఆదివారం) నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్టు దేవాలయ అధికారులు ప్రకటించారు.

అయితే భక్తులకు ఎలాంటి సమచారం లేకుండా రాజన్న ఆలయం నుంచి భీమన్న ఆలయానికి దర్వనాలు ఎలా మారుస్తారని భక్తులు ఆందోళన వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు పొంతనలేని ప్రకటనలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఒకసారి మూసివేస్తామని ప్రకటించిన అధికారులు, మరోసారి ఆలయాన్ని మూసివేయడం లేదని ఎప్పటిలాగే దర్శనాలు ఉంటాయని ప్రకటించడం మరోసారి వివాదస్పదమైంది.దీనిపై విమర్శలు రావడంతో మరో ప్రకటన జారీచేశారు.

Also Read :  జూబ్లీహిల్స్‌ లో దొంగ ఓట్ల కలకలం.. ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్!

Controversy Over Darshans In Vemulawada

రాజన్న(rajanna-sirisilla-district) మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారని కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌(Bandi Warning On Rajanna Temple Close) ప్రశ్నించడంతో పాటు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనం జరిగాయి. దీంతో రాజన్న ఆలయం మూసివేత ఉండదని ఎప్పటిలాగే స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రటించారు. రాజన్న ఆలయంలో యంత్రాలతో పనులు జరిగే సమయంలో ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు. దీనిపై విమర్శలు రావడంతో మరో ప్రకటన జారీచేశారు.

అలాగే ప్రధాన ఆలయంలో నిత్య కైంకర్యాలు, చత్షుకాల పూజలు, ఆలయ అర్చకులు యధావిధిగా, ఆంతరంగికంగా నిర్వహిస్తారని ప్రకటించారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి రాజన్న ముందు కోడె మొక్కులు, ఇతర పూజ కార్యక్రమాలు తీర్చుకుంటారు. వీటిని భీమేశ్వర ఆలయంలో ఎలా చేస్తామని భక్తులు ప్రశ్నిస్తున్నారు. రాజన్న ఒకచోట, మొక్కులు మరోచోట ఎలా తీర్చుకుంటామని భక్తులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో అధికారులున్నారు. ఏటా కోటిన్నర మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. జనవరి 28 నుంచి 31 వరకు తెలంగాణ కుంభమేళా సమ్మక-సారలమ్మ జాతర ఉన్నది.

ఈ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఆ సమయంలోనే దాదాపు కోటి మంది భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుంది. వచ్చేది కార్తీకమాసం. దీనికితోడు సమ్మక భక్తుల తాకిడి ప్రారంభం కానున్నది. ఇటువంటి పరిస్థితుల్లో భీమేశ్వర ఆలయంలో పూజలు చేస్తే రాజన్న దర్శనం ఎలా కలుగుతుందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. రాజన్న ఆలయంలో 12 నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించినా ఆదివారం మళ్లీ కల్పించారు. ఆదివారం నుంచి రాజన్న ఆలయంలో దర్శనాలు బంద్‌ చేస్తున్నట్టు ప్రకటించడంతో వేములవాడ పట్టణంలోని దాదాపు నాలుగైదు వేల మంది భక్తులు తరలివచ్చి శనివారం రాత్రి వరకు స్వామివారిని దర్శించుకున్న తీరు ప్రభుత్వ హడావుడి నిర్ణయాలకు, పొంతన లేని ప్రకటనలకు, పటిష్ట ప్రణాళిక లేని విస్తరణ పనులతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు