/rtv/media/media_files/2025/10/21/diwali-accidents-2025-10-21-13-03-21.jpg)
diwali accidents
AP, TG Accidents: నిన్న దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండగ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. ఇళ్లన్నీ దీపాల కాంతులతో వెలిగిపోయాయి. ప్రజలంతా ఇళ్ల ముందు టపాసులు పేల్చుతూ సరదా సరదాగా గడిపారు. కానీ, కొన్ని ఇళ్లల్లో దీపావళి నాడు విషాద ఛాయలు అలుముకున్నాయి. పండగపూట జరిగిన రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో ఏడుగురికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
కరీంనగర్ రోడ్డు ప్రమాదం..
దీపావళి నాడు కరీంనగర్ గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. కొండపల్లికి చెందిన ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ మల్లయ్య.. ద్విహక్రవాహనం పై వెళ్తున్న మరో యువకుడు మృతి చెందారు.
నెల్లూరులో మరో ప్రమాదం..
నెల్లూరు జిల్లా జలందంకి మండలం 9వ మెయిలు వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కావలి నుంచి లదంకి మండలం చామదల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు బస్సులో తక్కువ మంది ప్రయాణికులు ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
విశాఖలో మరో ప్రమాదం..
దీపావళి రోజే విశాఖలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పాత గాజువాక జంక్షన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరో ప్రమాదం..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం గొర్లగూడెం జాతీయ రహదారి 30పై ఆర్మీ జవాన్లు వెళ్తున్న కల్వర్టును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక జవాన్ మృతి చెందగా..మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Also Read: Wife Illegal Affair: మేనల్లుడితో ఇద్దరు పిల్లల తల్లి జంప్.. 7నెలల తర్వాత షాకింగ్ ఇన్సిడెంట్