Weather Update: తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

గతకొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరోసారి రాష్ట్రంలో వర్షాలు కురవబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.

New Update
rains

rains

గతకొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరోసారి రాష్ట్రంలో వర్షాలు కురవబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, జోగులాంబ గద్వాల, మెదక్, నారాయణ్ పేట, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్, హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. 

ఇది కూడా చూడండి: Local Body Elections : ఇదేం టెన్షన్ మావా.. పోటీ చేద్దామా వద్దా..  ఆశావహులకు రోజుకో ట్విస్ట్!

సిటీలో ఈ ప్రాంతాల్లో వర్షాలు..

ఇక హైదరాబాద్ విషయానికొస్తే మాదాపూర్, యూసఫ్‌గూడ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, పఠాన్‌చెరువు, మియాపూర్, సికింద్రాబాద్, అమీర్‌పేట, బేగంపేట, ప్రకాష్ నగర్, దిల్‌సుఖ్ నగర్, ఎల్‌బీనగర్, మలక్‌పేట, ఎంజీబీఎస్, చాదర్‌ఘడ్, అఫ్జల్ గంజ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. 

ఇది కూడా చూడండి: Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుచుకుంటాం: మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

Advertisment
తాజా కథనాలు