Sigachi Explosion: పాత డ్రయర్.. పట్టించుకున్న పాపాన పోలేదు..41 మంది బలి..
పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమ ప్రమాదంలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలో ప్రమాదానికి పూర్తి బాధ్యత కంపెనీ యాజమాన్యానిదే అని తేల్చి చెప్పింది.