HYD AQI INDEX : దీపావళి తర్వాత హైదరాబాద్‌లో పెరిగిన వాయు కాలుష్యం! AQI ఇండెక్స్ ఎంతో తెలిస్తే షాక్!

దీపావళి పండగ వచ్చిదంటే రెండు, మూడు రోజుల ముందు నుంచే టపాసుల మోత మోగిపోతుంది.   టపాసులు పేల్చడం వల్ల ప్రజలకు ఆనందాన్ని అందించినప్పటికీ.. వీటి ద్వారా ఏర్పడే కాలుష్యం అత్యంత ప్రమాదకరమైనది.  

New Update
AQI INDEX

AQI INDEX

HYD AQI INDEX:  దీపావళి పండగ వచ్చిదంటే రెండు, మూడు రోజుల ముందు నుంచే టపాసుల మోత మోగిపోతుంది.   టపాసులు పేల్చడం వల్ల ప్రజలకు ఆనందాన్ని అందించినప్పటికీ.. వీటి ద్వారా ఏర్పడే కాలుష్యం అత్యంత ప్రమాదకరమైనది. నిన్న  దీపావళి తర్వాత.. టపాసులు పొగతో హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత మరింత విషపూరితంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా CPCB (Central Pollution Control Board) షాకింగ్  లైవ్ రిపోర్ట్ విడుదల చేసింది. 

అత్యంత ప్రమాదంకరం 

సాధారణ రోజుల్లో 'మితమైన' (Moderate) స్థాయిలో ఉండే గాలి నాణ్యత  దీపావళి బాణాసంచా కాలుష్యంతో 'అనారోగ్యకరమైన' స్థాయిలకు చేరుకుంది. నిన్న రాత్రికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 338గా నమోదైనట్లు సెంట్రల్ AQI లైవ్ రిపోర్ట్ తెలిపింది.  గాలి నాణ్యత 150, 200 ఉంటేనే చాలా అనారోగ్యకరమైనది.. అలాంటిది 338 స్థాయికి చేరుకోవడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.  ఇలాంటి గాలి పీల్చడం ద్వారా ప్రజలకు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

టపాసులు పేల్చడం వల్ల గాలిలో కాలుష్య కారకాలు.. ముఖ్యంగా PM 2.5 (2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే సూక్ష్మ రేణువులు) స్థాయిలు గమనీయంగా పెరుగుతాయి. ఇవి ఊపిరితిత్తుల్లోకి, రక్తంలోకి సులువుగా చేరిపోయి ఆరోగ్యానికి హానీ కలిగిస్తాయి. దీపావళి తర్వాత వీటి గాలిలో వీటి పరిమాణం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన పరిమితి కంటే చాలా ఎక్కువ రెట్లు నమోదైంది.  

ఆరోగ్యానికి హానికరం.. 

ఇలాంటి కలుషితమైన గాలిని పీల్చడం ద్వారా ప్రజలు ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు దీర్ఘకాలికంగా ఈ కాలుష్యానికి గురవ్వడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా  ఉంది.  అలాగే కళ్ళు మండడం, గొంతు నొప్పి, దగ్గు వంటి ఇబ్బందులు సాధారణంగా కనిపిస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గాలి నాణ్యత మెరుగయ్యే వరకు ఎక్కువగా బయట తిరగడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్దులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం సురక్షితమని చెబుతున్నారు. ఇంట్లో కాలుష్యం ప్రభావం తగ్గించడానికి కిటికీలు , తలుపులు మూసి ఉంచండి. 

Also Read: Wife Illegal Affair: మేనల్లుడితో ఇద్దరు పిల్లల తల్లి జంప్.. 7నెలల తర్వాత షాకింగ్ ఇన్సిడెంట్

Advertisment
తాజా కథనాలు