/rtv/media/media_files/2025/10/20/a-bottle-of-liquor-worth-rs-31-000-for-a-buffalo-2025-10-20-21-04-08.jpg)
A bottle of liquor worth Rs. 31,000 for a buffalo
HYD Sadar: హైదరాబాద్‌లో దీపావళి సందర్బంగా యాదవులు సదర్ ఉత్సవాన్ని అంత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దున్నపోతులతో వారు నిర్వహించే విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన తెలంగాణ యాదవులంతా కుటుంబసమేతంగా ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ, ఏపీలో కొత్త వైరస్ కలకలం.. ఒల్లంతా బొబ్బలు.. భయం భయం!
దీపావళి సందర్భంగా సదర్ పండగను నగర వ్యాప్తంగా ప్రధాన కూడల్లో నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో యాదవులు తమ దున్నపోతులను ప్రదర్శించడం ఆనవాయితీ. అంతేకాదు.. దున్నపోతులతో కుస్తీ పడుతూ విన్యాసాలు చేస్తూ నృత్యాలు చేయిస్తారు. ఇది సదర్ వేడుకలో ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇక వారు ప్రదర్శించే దున్నపోతులు సైతం లక్షల రూపాయల ధర పలుకుతాయి. వాటిని ఏడాది కాలంగా అత్యంత నాణ్యమైన, బలవర్ధకమైన ఆహారం అందించి పెంచుతారు.
అందులో భాగంగానే ముషీరాబాద్‌లో ఈసారి సదర్ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకల్లో వస్తాద్ గుమాన్ కాళీ కి చెందిన దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2500 కేజీల బరువు.. 7 అడుగుల వెడల్పు ఉన్న ఈ దున్నపోతును మధు యాదవ్ అనే వ్యక్తి కేరళ నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన సదర్ ఉత్సవంలో ఈ దున్నను ఆయన ప్రదర్శించాడు. ఈ సందర్భంగా దున్నపోతుకు మధుయాదవ్ రూ. 31 వేల విలువజేసే రాయల్ సెల్యూట్ విస్కీ ఫుల్ బాటిల్ తాగించడం సంచలనంగా మారింది. ఈ విస్కీ 21 ఇయర్స్ ఓల్డ్‌దిగా చెబుతున్నారు. కేవలం విస్కీకికే 31 వేలు ఖర్చు పెడితే దున్నపోతును మెపడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడనే చర్చ సాగుతోంది. కాగా దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: పాక్ ప్రధాని దీపావళి శుభాకాంక్షలు.. ఏమని ట్వీట్ చేశాడో తెలుసా?
Follow Us