Bihar Elections 2025 : బీహార్ ఎన్నికల్లో సంచలనం.. పోటీ నుంచి తప్పుకున్న జేఎంఎం

బీహార్ ఎన్నికల వేళ తాజా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మహాఘట్‌బంధన్‌ కూటమిలో భాగమైన జేఎంఎం పోటీ నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది.

New Update
JMM withdraws from the contest

JMM withdraws from the contest

Bihar Elections 2025:బీహార్ ఎన్నికల వేళ తాజా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్‌ కూటమిలో భాగమైన జేఎంఎం పోటీ నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది.  కాంగ్రెస్, ఆర్జేడీ తమకు సీట్లు దక్కకుండా రాజకీయ కుట్ర చేయడం మూలంగానే  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు  జేఎంఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‎లో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి జేఎంఎంకు అన్యాయం చేశాయని ఆరోపించారు. దీనివల్ల జార్ఖండ్‌లో కాంగ్రెస్, ఆర్జేడీలతో పొత్తు విషయమై  జేఎంఎం పునరాలోచిస్తుందని తెలిపారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన సమాధానం ఇస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. 

Also Reda: INS విక్రాంత్‌పై ప్రధాని దీపావళి వేడుకలు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ?

కాగా, బీహార్‎లో ప్రతిపక్ష కూటమి మహాఘాట్ బంధన్  పేరుతో పోటీ చేస్తుంది. ఈ కూటమిలో జేఎంఎం పార్టీ భాగస్వామిగా ఉంది. అయితే.. సీట్ల పంపకాల విషయంలో మహాఘాట్ బంధన్ కూటమిలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జేఎంఎం అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ నిరాకరించినట్లు తెలుస్తోంది. సీట్ల పంపకాల విషయంలో కూటమితో చర్చలు విఫలం కావడంతో బీహార్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని జేఎంఎం పార్టీ రెండు రోజుల క్రితం వెల్లడించింది.

Also Read: మీ కూతుర్లు హిందూయేతరులతో వెళ్తే కాళ్లు విరగ్గొట్టండి..  ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు

కాగా బీహర్‌ లోని చకై, ధమ్‌దహా, కటోరియా, మణిహరి, జముయ్, పిర్‌పైంటి.. తదితర ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని జేఎంఎం నిర్ణయించింది. నామినేషన్ దాఖలకు చివరి రోజైన సోమవారం (అక్టోబర్ 20) అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. బీహార్‎ ఎన్నికల్లో ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తుందని భావించిన మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకాల్లో నెలకొన్న విభేదాలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. విభేదాల మూలంగా ఎన్డీఏకు లాభం చేకూరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

Also Read: పండగ పూట విషాదం.. కూతురితో అలా చేశాడని యువకుడిని దారుణంగా చంపిన తండ్రి!

మరోవైపు జార్ఖండ్‎లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో ఆర్జేడీ, కాంగ్రెస్ కూడా భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ తీరుతో బీహార్‎లో సీట్ల పంపకాల్లో విభేదాలు రావడంతో  జేఎంఎం.. జార్ఖండ్‎లో కాంగ్రెస్, ఆర్జేడీతో పొత్తును పునరాలోచిస్తామని  చెప్పడం  జార్ఖండ్‎ రాజకీయాల్లో కీలక చర్చకు దారి తీసింది.

Also Read :  పండగ వేళ వాహనదారులకు గుడ్‌న్యూస్.. NHAI కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు