/rtv/media/media_files/2025/10/21/brs-jubileehills-election-2025-10-21-17-03-53.jpg)
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం 40 మంది స్టార్ కంపెయినర్ల లిస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు అందించింది. ఈ లిస్ట్ ను ఎన్నికల కమిషన్ ఆమోదించింది. అయితే.. ఈ లిస్ట్ లో బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో ఆయన ఎన్నికల ప్రచారానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం బీఆర్ఎస్ తరపున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
— BRS Party Bellampalli (@TrsBellampalli) October 21, 2025
పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనే 40 మంది ప్రముఖులలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్..@BRSpartypic.twitter.com/abOEpBoCVa
బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ భారీ విజయం సాధించి జీహెచ్ఎంసీ పరిధిలో తమకు పట్టు ఏ మాత్రం తగ్గలేదని.. రాష్ట్రంలోనూ వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని చాటాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టారు. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించారు. అన్నీ పార్టీల కన్నా ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే గోపినాథ్ సతీమణి సునీతను ప్రకటించారు. ప్రతీ డివిజన్ కు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఇన్చార్జులుగా నియమించింది. ఇప్పటికే ఆయా నేతలు ప్రతీ ఇంటి తలుపు తట్టి ప్రచారం చేస్తున్నారు.
అయితే.. కేసీఆర్ ప్రచారానికి వస్తే శ్రేణుల్లో జోష్ మరింత పెరుగుతుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా ప్రచారానికి రావాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రచారం చివరి రోజుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు మద్దతుగా కేసీఆర్ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. రోడ్ షో నిర్వహిస్తారా? లేక భారీ బహిరంగ సభ నిర్వహిస్తారా? అన్న అంశంపై ఒకటి లేదా రెండ్రోజుల్లు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Follow Us