Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ముగిసిన నామినేషన్ల పర్వం.. పోటీలో ఎంతమందంటే ?

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేటితో గడువు ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 150 కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.

New Update
Jubilee Hills by election

Jubilee Hills by-election

Jubilee Hills by-election:  హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లకు నేటితో గడువు ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 150 కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. నవీన్‌ యాదవ్‌ కాంగ్రెస్ నుంచి 2 సెట్ల నామినేషన్‌ను వేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్ వేశారు. అటు BRS నుండే పి. విష్ణువర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఆయన భార్య ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈరోజు లంకల దీపక్ రెడ్డి మరో సెట్ నామినేషన్ వేశారు. నామినేషన్లను అధికారులు రేపు స్క్రూటినీ చేయనున్నారు. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు, రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. అక్టోబర్‌ 24 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఉంది. నవంబర్‌ 11న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Also Read : K Ramp Collections: 'కె-ర్యాంప్' కలెక్షన్స్..! అప్పుడే బ్రేక్ ఇవెన్ అయిపోయిందా..?

దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.  దీంతో ఆపార్టీ గోపీనాథ్‌ భార్యకు టికెట్‌ కేటాయించగా కాంగ్రెస్‌ నుంచి నవీన్‌యాదవ్‌, బీజేపీ నుంచి లంకల దీపక్‌ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ స్థానంలో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీలు తమదైన వ్యూహ రచనతో ముందుకు వెళుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ ను కాదని కాంగ్రెస్‌ కు పట్టం కట్టడంతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్.. ఈ స్థానాన్ని గెలిచి మరో మారు తన సత్తా చూపించాలని భావిస్తోంది. అటు పదేళ్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే పార్టీకి పూర్వ వైభవం రావాలంటే జూబ్లీహిల్స్ నుంచే తొలి అడుగేసి గెలుపు రుచిని చూడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Also read : HYD AQI INDEX : దీపావళి తర్వాత హైదరాబాద్‌లో పెరిగిన వాయు కాలుష్యం! AQI ఇండెక్స్ ఎంతో తెలిస్తే షాక్!

ఇక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలలో గెలుపొంది రాష్ట్రంలో బీజేపీ ఊపు మీద ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపొంది.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునే దిశగా  ఆపార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే అభ్యర్థులు మాగంటి సునీత, నవీన్ యాదవ్, లంకల దీపక్ రెడ్డి విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. డివిజన్లలో క్షేత్ర స్థాయిలో క్యాంపెయినింగ్ చేస్తూ దూసుకెళ్తున్నారు.కాగా వీరితో పాటు పలువురు స్వాతంత్ర్య అభ్యర్థులుగా నామినేషన్‌ వేసినప్పటికీ వారి ప్రచారం మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. మూడు పార్టీల  ప్రత్యర్థుల మధ్య పోటాపోటీ ఉండటంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రోజురోజుకి పెరుగుతుంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డి ప్రత్యర్థులను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు