/rtv/media/media_files/2025/02/06/zBkvfpYBt7D6UlMkn5bs.jpg)
Secretariat – Telangana State
తెలంగాణ సచివాలయంలో ఐటీ మంత్రి పేషీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఐటీ మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్ మంజూరు చేస్తామంటూ రూ.కోటి 77 లక్షలు తీసుకున్నారు కొందరు దుండగులు. మియాపూర్ చెందిన ఐటీ ఇంజినీర్‌ను టార్గెట్‌గా చేసుకుని మాయమాటలు చెప్పి.. ప్రభుత్వ అధికారులమంటూ నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశారు.
తెలంగాణ సచివాలయంలో ఐటీ మంత్రి పేషీ పేరుతో భారీ మోసం
— Telugu Scribe (@TeluguScribe) October 19, 2025
ఐటీ మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్ మంజూరు చేస్తామంటూ కోటి 77 లక్షలు తీసుకొని మోసం
మియాపూర్ ఐటీ ఇంజినీర్‌ను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశారు.
మంత్రి ఓఎస్‌డీ లెటర్‌హెడ్‌లు, నకిలీ… pic.twitter.com/TgMjc4icCD
మంత్రి ఓఎస్‌డీ లెటర్‌హెడ్‌లు, నకిలీ పత్రాలు చూపి బాధితుడిని నమ్మించారు మోసగాళ్లు. డబ్బులు కోల్పోయిన సదరు వ్యక్తి ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. విచారణ కోసం సీసీఎస్‌కు కేసు బదిలీ చేశారు.
నిత్యం డిజిటల్ అరెస్టులు
సీబిఐ ఆఫీసర్లు, ఇన్‌కం ట్యాక్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామంటూ నమ్మించి ఇటీవల అనేక సైబర్ నేరాలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు వారి అనుచరులు ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ పథకాలు మంజూరు చేయిస్తామని నమ్మించి అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఈక్రమంలో ఓ మంత్రి పేషీ పేరుతో ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి మోసానికి పాల్పడటం కలకలం రేపింది.