BRS Party: బీఆర్ఎస్ పార్టీ సంచలనం..హైడ్రా బాధితుల పిల్లలతో దీపావళి వేడుకలు

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చడం తప్ప ఒక్క కొత్త నిర్మాణం చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. దీపావళి సందర్భంగా సున్నం చెరువు హైడ్రా కూల్చివేతల బాధితులతో దీపావళి పండుగను జరుపుకున్నారు కేటీఆర్.

New Update
Ktr and Harish Rao Diwali Celebrations

Ktr and Harish Rao Diwali Celebrations

BRS Party: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చడం తప్ప ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క కొత్త నిర్మాణం చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలను కష్టపెట్టడం మినహా చేసిందేమీ లేదని మండిపడ్డారు. సోమవారం సాయంత్రం ఆయన  మాదాపూర్‌లోని సున్నం చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. హైడ్రా బాధితులతో కలిసి సున్నం చెరువు ప్రాంతానికి వెళ్లారు. దీపావళి సందర్భంగా సున్నం చెరువు హైడ్రా కూల్చివేతల బాధితులతో దీపావళి పండుగను జరుపుకున్నారు కేటీఆర్. సున్నం చెరువు బాధిత కుటుంబాల పిల్లలతో కలిసి టపాకాయలు కాల్చారు. కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ వాసులతో మాట్లాడి ప్లాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండడానికి గూడు లేకుండా చేసింది. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారిని దౌర్జన్యంగా ఇక్కడి నుంచి వెళ్లగొట్టింది. హైదరాబాద్‌లో హైడ్రా వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వమే వస్తుందని, ఇంకో రెండేళ్లలో తెలంగాణ మళ్లీ వెలుగులు చూడొచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ వెంట మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపుర్‌ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.

 మూసీ బాధితులతో హరీష్‌రావు

హైడ్రా పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతలు ఆగాలంటే జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని భారత రాష్ట్ర సమితి నేత హరీశ్‌ రావు అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్‌షా కోట్‌లో హైడ్రా కూల్చివేసిన  మూసీ బాధితులతో ఆయన  దీపావళి పండుగ చేసుకున్నారు. ‘‘మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లు కూలగొట్టడం దుర్మార్గం. కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం కంటికి కునుకు లేకుండా చేస్తోందని ఆరోపించారు. బడా పారిశ్రామికవేత్తల కోసం పేదల బతుకులు కూలుస్తారా? అని మండిపడ్దారు.  హైడ్రా అనేది అందరికీ సమానంగా ఉండాలి.  రేవంత్ రెడ్డి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కటింగ్ మాస్టర్ అన్నారు. కేసీఆర్‌ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్ కట్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు కోత పెడుతారు’’ అని విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారితో పాటాకులు కాల్చి దీపావళి జరుపుకున్నారు. ఆయన వెంట కార్తీక్‌ రెడ్డి ఇతర పార్టీ నేతలు ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు