/rtv/media/media_files/2025/09/22/hyderabad-rain-8-2025-09-22-18-44-46.jpg)
Big alert for Hyderabad..
Big alert : గత కొంతకాలంగా కొంత వర్షాలకు బ్రేక్ ఇచ్చిన వాతావరణం ఈ రోజు మరోమారు తన ప్రతాపం చూపింది. ఈ రోజు మధ్యాహ్నం నగర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా మరోసారి హైదరాబాద్‌లో మరికొద్దిసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఎల్బీనగర్, వనస్థలిపురం,ఉప్పల్, నాగోల్, చార్మినార్, మీర్ పేట్, గుర్రంగూడ,హయత్ నగర్, చాంద్రాయణగుట్ట, బీఎన్ రెడ్డి, సైదాబాద్, బృహన్ పేట, మలాపురం, బర్కాస్, బహదూర్‌పుర, కిషన్ బాగ్, మలక్‌పేట్, రాజేంద్రనగర్, ఆరామ్‌ఘర్, , నాంపల్లి, ఆసిఫ్ నగర్, అత్తాపూర్, లంగర్ హౌస్, బండ్లగుడ జాగీర్ ప్రాంతాల్లో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.20 వరకు భారీ వర్షం కురిసే అవకావం ఉందని తెలిపారు. అంతే కాకుండా నగరంలోని మిగితా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: సచివాలయంలో భారీ మోసం.. మంత్రి పేషీ పేరుతో కోట్లు కాజేసిన కేటుగాళ్లు
మరోవైపు గుంటూరు, ప్రకాశం నుంచి తెలంగాణలోకి భారీ ఉపరితల ఆవర్తనం కదులుతోంది.దీనివల్ల రానున్న మూడు గంటల్లో నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డిలో భారీ వర్షాల నుంచి ఓ మోస్తరు - వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని తెలిపారు. రానున్న 2 గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, యాదాద్రి - భోంగీర్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, భద్రాద్రి - కొత్తగూడెంలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. హైదరాబాద్ -లో రాబోయే 2-3 గంటలలో చిన్న వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Also Read : దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే..!
Follow Us