Hyderabad: కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే.. కీసరలో యజమానిని దారుణంగా కొట్టిన హిజ్రాలు!
మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు దారుణానికి తెగబడ్డారు. కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇంటి యజమాని పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు దారుణానికి తెగబడ్డారు. కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇంటి యజమాని పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంగించిన పలువురిపై హైదరాబాద్ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. MLAలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, రాందాస్‌పై మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో 2 కేసులు, బోరబండ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.
ప్రముఖ రచయిత అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఘట్కేసర్లోని అందెశ్రీ అంతిమయాత్రలో రేవంత్ రెడ్డి పాడె మోశారు. ఓ కళాకారుడిగా, రచయితగా ఆయన ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ సోమవారం మృతి చెందడంతో నేడు అంత్యక్రియలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి అందెశ్రీకి ఘన నివాళులర్పించి పాడె మోశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటర్ల స్పందన మందగించింది. ఉదయం 11 గంటల వరకు కేవలం 20.76% పోలింగ్ మాత్రమే నమోదైంది. బస్తీ ప్రాంతాల్లో కొంతమంది ఓటు వేస్తుండగా, మిగతా ప్రాంతాల్లో ఓటర్లు నిర్లక్ష్యంగా ఉన్నారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్‌సర్క్యూట్‌తో ఇంజన్లో మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును రోడ్డు పక్కకు ఆపేశాడు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
హైదరాబాద్ లో మరో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన డాక్టర్ అహ్మద్ సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించినట్లు తెలిసింది.
రాష్ట్రంలో పలు సందర్భాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వీటన్నింటికీ భిన్నం. ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కడుతాడనేది నవంబర్ 14న తేలనుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని BRS నేత హరీశ్ రావు అన్నారు. ఆయన సోమవారం BRK భవన్లో ఎన్నికల అధికారి సూదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంగించి కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నారు.